ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలతో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో వస్తే మరో ఉప్పెన తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తనను సంప్రదించకుండా ఈటల రాజేందర్ ను ఎలా బీజేపీలోకి ఆహ్వానిస్తారని నిలదీశారు పెద్దిరెడ్డి. ఒక్క వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని..ఆయనతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా తనను అడగకపోవడం శోచనీయమన్నారు.
ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు… నాకు చెప్పడానికి ఏంటి బాధ ? హైదరాబాద్ లోని వివేక్ ఫామ్ హౌస్ లో చర్చలు జరిపితే కూడా నేను గుర్తు లేదా…? అని రాష్ట్ర నాయకులను నిలదీశారు. తనను కాదని పార్టీలోకి ఎలా తీసుకుంటారు…స్థానిక ప్రతినిధిని అయిన తనను సంప్రదించకుండా ఎలా చర్చలు జరుపుతారని నిలదీశారు పెద్దిరెడ్డి