తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున సహాయం మంజూరు చేసింది. మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ జీవో జారీ చేసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27 మంది రైతులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 మంది రైతులు, భూపాలపల్లిలో 12 మంది రైతుల…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో దీక్ష చేస్తే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తున్నాడని.. తాము రైతుల కోసం ఆలోచిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. Read Also:…