Student Suicide : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థి సంఘాల ఆందోళన..
- శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి మృతి
- గృహప్రవేశానికి సెలవు నిరాకరించారని ఆరోపణ
- యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
- కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరు సమీపంలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కార్తీక్ (16) అనే విద్యార్థి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నూతన గృహప్రవేశం వేడుక ఉన్నందున ఇంటికి వెళ్లాలని కోరినా ప్రిన్సిపల్ సెలవు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన కార్తీక్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రిన్సిపల్ తీరుపై ఆరోపణలు.. మృతదేహం తరలింపుపై వివాదం
శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరు వల్లే కార్తీక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన తర్వాత కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించిందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ పరిణామాలతో విద్యార్థి వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
Also Read
- OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
- Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
- Illandu Missing Person : ఇల్లందులో 45 రోజులుగా కనిపించని వ్యక్తి.. వీడని మిస్టరీ
- Nitin Nabin : తెలంగాణకు నితిన్ నబీన్.. రెండు పాదయాత్రల ప్లాన్
కాలేజీ వద్ద ఆందోళన.. పోలీసుల కేసు నమోదు
కార్తీక్ మృతి వార్త తెలియడంతో విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఆదిభట్ల పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Student Suicide : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థి సంఘాల ఆందోళన..
-
OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
-
OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
-
Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!