టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం పై ఎమ్మెల్యే బాలయ్య స్పందించారు. ఇవాళ తన నివాసం లో ప్రెస్ మీట్ నిర్వహించిన బాలయ్య బాబు.. వైసీపీ తీరుపై మండి పడ్డారు. తమ సోదరి భువ నేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడటం చాలా దారుణమని నిప్పులు చెరిగారు. అసలు ఓ మహిళపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు బాలయ్య.
ఇష్యూ మీద మాట్లాడాలి… కానీ.. దానికి సంబంధం లేని బయట ఉన్న మహిళలపై మాట్లాడటం దారుణమన్నారు. చంద్రబాబు ఏనాడూ కంటతడి పెట్టు కోలేదని చెప్పిన బాలయ్య… ఆయనది చాలా గట్టి గుండె అని అన్నారు. కానీ ఆయనకే కన్నీళ్లు తెప్పించేలా.. వైసీపీ నాయకులు వ్యవహరించడం దారుణమన్నారు. చంద్రబాబు పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు.ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట క్యారెక్టర్ అస్సాసియేషన్ మంచిది కాదన్నారు. అసెంబ్లీ వాగ్వాదాలు మామూలే కాని వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాప్రతినిధుల సంస్కారం కాదన్నారు.