ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ ఫైనల్స్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ తీసుకొని కివీస్ ను మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ ఎటువంటి మార్పులు లేకుండా వస్తుంటే కివీస్ మాత్రం గాయపడిన కాన్వే స్థానంలో టిమ్ సీఫెర్ట్ ను జట్టులోకి తెచ్చింది. ఇక ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు టీ20 ప్రపంచ కప్ అందుకోకపోవడంతో.. ఈసారి ఎవరు గెలిచిన కొత్త విజేతగా నిలుస్తారు. కాబట్టి ఇందులో విజయం సాధించి… ఎవరు టైటిల్ అందుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది.
ఆసీస్ : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(C), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(WK), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
కివీస్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(C), టిమ్ సీఫెర్ట్(WK), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్