అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం.. వైసీపీకి అచ్చెన్నాయుడు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజులుగా ఏపీ మొత్తం టీడీపీ, వైసీపీ ల నిరసనలతో అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యాలయం అంటే దేవాలయం వంటిదని, ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. నేతల భాష విషయంలో జగన్ చర్చకు సిద్దమా..? అని సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ఎవరేం మాట్లాడారో ప్రజలకు తెలుసునన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారని, రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందనే ఆవేదనతో తెలుగుదేశం పోరాడుతుంటే దాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు మా నివాళులు అర్పిస్తామన్నారు. ప్రాణ త్యాగం చేసిన పోలీసుల ఆత్మలు ఈ డీజీపీ తీరుతో ఘోషిస్తాయని, రెండున్నరేళ్లలో డీజీపీ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి కుట్ర పన్ని తొలుత చంద్రబాబు నివాసం పైకి దాడికి యత్నించారని, తర్వాత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ రీతిలో జరగలేదని, సమాజ చైతన్యం కోసమే ఈ 36 గంటల దీక్ష అన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
టీడీపీని భూస్థాపితం చేయడం జగన్ నాయన వల్లే కాలేదని, తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలమని, అధికారంలోకి రాగానే ఏ మూల దాక్కున్నా లాగి లాగి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు భయపడేది లేదని, సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమవటంతో వైసీపీ కౌంటర్ దీక్షలకు దిగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో లభ్యమయ్యే నాసిరకం మద్యంలో మాదక ద్రవ్యాలు కలుపుతుని ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి గంజాయి కొత్త కాదని డీజీపీ మాట్లాడటం దుర్మార్గమని, ఏపీని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేంత వరకు పోరాడతామన్నారు.
తాజావార్తలు
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!