కోవిడ్ కలకలం.. 5 రోజుల్లో 242 మంది చిన్నారులకు పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు.. ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.. అయితే, థర్డ్ వేవ్‌లో ఎక్కువ మంది చిన్నారులు కరోనాబారిన పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.. ఈ తరుణంలో.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది.. గడిచిన 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 242 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారేనని అధికారులు చెబుతున్నారు.. పాజిటివ్‌గా తేలినవారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్లవారు 136 మంది ఉన్నారు.. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇక, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉండడం.. ఈసారి చిన్నారులపైనే అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో.. ఐదు రోజుల్లోనే పెద్ద సంఖ్యలో చిన్నారులు కోవిడ్ బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది.. దీంతో అప్రమత్తమైన అధికారులు చిన్నారులను ఇళ్లలోనే ఉంచాటని సూచిస్తున్నారు. ఈ కేసులో మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ విలయం సృష్టించిన సమయంలో.. కర్ణాటకలోనూ పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారినపడిన సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!