కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు.. ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.. అయితే, థర్డ్ వేవ్‌లో ఎక్కువ మంది చిన్నారులు కరోనాబారిన పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.. ఈ తరుణంలో.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది.. గడిచిన 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 242 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారేనని అధికారులు…