భార్య‌కు తాజ్ మ‌హ‌ల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన భ‌ర్త‌…

స్వ‌చ్ఛ‌మైన‌, నిర్మ‌ల‌మైన ప్రేమ‌కు గుర్తుగా తాజ్‌మ‌హ‌ల్‌ను చెబుతుంటారు.  ప్ర‌పంచ వింత‌ల్లో ఒక‌టైన తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శించేందుకు నిత్యం వేలాది మంది సంద‌ర్శ‌కులు వ‌స్తుంటారు.  తాజ్‌మ‌హల్‌ను చూసి ఆనందించి వెళ్తుంటారు. ఎవ‌రూ కూడా అందులో నివ‌శించాల‌ని అనుకోరు.  

Read: బూస్ట‌ర్ డోస్‌పై ఐసీఎంఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌…

అయితే, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ప్ర‌కాశ్ చోక్సీ అనే వ్య‌క్తి త‌న భార్య‌కు ప్రేమ కానుక‌గా నాలుగు బెడ్‌రూమ్‌లు, ధ్యాన‌మందిరం, ఓ పెద్ద హాలు, లైబ్ర‌రీ అచ్చుగుద్దిన‌ట్టు తాజ్ మ‌హ‌ల్ లాంటి ఇల్లును నిర్మించి ఇచ్చారు.  బుర్హాన్‌పూర్‌లో ఈ ఇల్లు ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బుర్హాన్‌పూర్ వ‌చ్చిన వ్య‌క్తులు ప్ర‌కాశ్ చోక్సీ ఇంటిని చూడ‌కుండా వెళ్ల‌రు.  ఈ ఇంటి నిర్మాణం కోసం మూడేళ్లు స‌మ‌యం ప‌ట్టింద‌ని చోక్సీ పేర్కొన్నారు. 

Related Articles

Latest Articles