రోడ్లు బాగుచేయడంపై దృష్టి పెట్టండి.. సీఎం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. వాహనదారులకు రోడ్లు నరకపాయంగా మారిపోయాయి.. ఏపీ ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో విమర్శలు కూడా వెల్లువిత్తాయి.. ఈ నేపథ్యంలో రోడ్లు బాగు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి, శంకర్‌నారాయణ, మేకపాటి గౌతంరెడ్డి.. సంబంధిత అధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్టోబర్ మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి.. తర్వాత పనుల కాలం మొదలవుతుందన్నారు.. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించిన ఆయన.. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం.. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారని మండిపడ్డారు.
ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడుతున్నాయన్నారు సీఎం వైఎస్ జగన్.. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారన్న ఆయన.. వర్షాలతో మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయని.. రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు.. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంటున్నాం.. ఒక నిధిని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు.. మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు సీఎం జగన్.. దురుద్దేశంతో ప్రచారం చేసినా మనం చేయాల్సిన పనులు చేద్దామని.. ఈ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దాం అన్నారు.. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే… నెగెటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మనం బాగుచేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయన్న సీఎం.. రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారు.. మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. అక్టోబర్‌లో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని.. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!