పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వినుకొండ మండలం శివాపురం వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బొలెరో ట్రాలీ.. లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి వ్యవసాయ కూలీలను వినుకొండకు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ…
కేంద్ర నౌకాయాన జల రవాణాశాఖా మంత్రి సర్పానంద సోనోవాల్ నేతృత్వంలోనీ కేంద్ర బృందం ఇవాళ ఏపీకి రానుంది. సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం సమావేశం కానుంది. ఏపీలో నౌకల మరమ్మత్తు కేంద్రం ఏర్పాటుపై సీఎంతో కేంద్ర అధికారులు మాట్లాడనున్నారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. రాష్ట్రంలో నౌకల మరమ్మత్తుల కేంద్రం నిర్మాణానికి రూ.3 వేల కోట్లు అవుతుందని అంచనా. ఏటా 300 నౌకలు రీసైక్లింగ్ కోసం రానున్నాయి. ఏపీలో…
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పటికే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. చివరకు జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని అన్నారు.
కేంద్ర పోర్టులు, ఓడరేవులు, జలమార్గాలు మంత్రి సబరనాథ్ సోనోవల్ ని కలిశారు ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. గతంలో ఈ శాఖలకు కేంద్ర మంత్రిగా మనుసుఖ్ మాండవీయ నిర్వహించిన నేపథ్యంలో, ప్రస్తుత మంత్రి సోనోవల్ కి ఏపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికను మరోసారి వివరించిన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. రాష్ట్రంలోని 3 పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్ లకు అందించాల్సిన కేంద్ర నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ…
వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. వాహనదారులకు రోడ్లు నరకపాయంగా మారిపోయాయి.. ఏపీ ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో విమర్శలు కూడా వెల్లువిత్తాయి.. ఈ నేపథ్యంలో రోడ్లు బాగు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి, శంకర్‌నారాయణ, మేకపాటి గౌతంరెడ్డి.. సంబంధిత అధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్టోబర్ మాసానికల్లా వర్షాలు…