Bengaluru Traffic: కారులో వెళ్తే 44 నిమిషాలు, నడిచివెళ్తే 42 నిమిషాలు.. బెంగళూర్‌లో ట్రాఫిక్ పద్మవ్యూహం..
- పద్మవ్యూహంగా బెంగళూర్ ట్రాఫిక్..
- కారులో వెళ్లడం కన్నా నడిచి వెళ్తేనే త్వరగా గమ్యం..
- వైరల్ అవుతున్న గూగుల్ మ్యాప్స్ స్క్రీన్ షాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Traffic: సిలికాన్ వ్యాలీ బెంగళూర్ నగర ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన ట్రాఫిక్ కలిగిన నగరాల్లో ఒకటిగా ఉంది. ఒక్కసారి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటే, ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి ఉంటుంది. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపైనే చిక్కుకుపోతుంటాయి. ఇక వర్షాకాలం ఈ ట్రాఫిక్ కష్టాలు మరింత ఎక్కువ.
తాజాగా బెంగళూర్ ట్రాఫిక్ కష్టాలను చూపెడుతూ, గూగుల్ మ్యాప్స్ ఫోటోను ఓ నెటిజన్ షేర్ చేయగా వైరల్‌గా మారింది. నగరంలో కారులో వెళ్లే కన్నా, నడిచి వెళ్తేనే త్వరగా గమ్యస్థానం చేరుకుంటారని గుగూల్ మ్యాప్స్ ట్రాఫిక్ పరిస్థితిని చూపించింది. 6 కి.మీ కారులో వెళ్లడానికి 44 నిమిషాలు పడితే, నడిచి వెళ్తే 42 నిమిషాల్లో చేరుకోవచ్చని సూచించింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Read Also: Jallikattu: తమిళనాడు జల్లికట్టులో విషాదం.. ఎద్దు కుమ్మడంతో యువకుడికి గుండెపోటు..
ఆయుష్ సింగ్ అనే వ్యక్తి దీనిని స్క్రీన్ షాట్ తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. బ్రిగేడ్ మెట్రోపాలిస్ నుండి KR పురం రైల్వే స్టేషన్ వరకు 6 కి.మీ దూరాన్ని కారులో వెళ్లేందుకు 44 నిమిషాలు పడుతుందని, నడిచి వెళ్లే 42 నిమిషాల్లోనే చేరుకోవచ్చని గూగుల్ మ్యాప్స్ సూచించింది.
‘‘”ఇది బెంగళూరులో మాత్రమే జరుగుతుంది’’ అంటూ అతను క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో 3 లక్షల వ్యూస్ వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా మరో నెటిజన్.. ఇది ప్రపంచంలోని అనేక పెద్ద నగరాల్లో జరుగుతుందని, మరొకరు ముంబై, ఢిల్లీల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. మరో నెటిజన్ ‘‘ భారతదేశ ట్రాఫిక్ రాజధాని’’ అని బెంగళూర్‌ని పిలిచారు. కొందరు ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రజా రవాణాను ఎంచుకోవాలని అతడికి సలహా ఇచ్చారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!