సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి అనగానే సదర్ ఉత్సవాలు స్పెషల్. ఏటా హైదరాబాద్ లో జరిగే సదర్ ఉత్సవాలకు రంగం సిద్ధమయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దున్నపోతులు సందడి చేస్తాయి. ఈ నెల 6న హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు జరుగుతాయి. ఖైరతాబాద్ గణపతి ప్రాంగణం నుంచి మార్కెట్ చౌరస్తా వరకు శుక్రవారం సాయంత్రం 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సదర్ ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఉత్సవాలకు మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రఘునందన్‌రావు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి అతిథులుగా పాల్గొంటారు. ఖైరతాబాద్ సోమాజిగుడ, పంజాగుట్ట, దోమల్‌గూడ, చింతలబస్తీ, పురానాపూల్ తదితర ప్రాంతాల నుంచి దున్నపోతులు ఊరేగింపుగా వస్తాయన్నారు.ఉత్సవాలకు హర్యానా నుంచి రూ.16 కోట్ల విలువచేసే కింగ్, సర్తాజ్ దున్నపోతులను తీసుకువస్తున్నారు. ఈ దున్నపోతులు ఎంత ఘనంగా వుంటాయో వాటి ధరలు కూడా మామూలుగా వుండవు.
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
- Jaishankar-Rubio: హార్ముజ్‌లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్‌కు రూబియో సూచన
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
కింగ్ దున్నపోతు వయస్సు నాలుగున్నరేళ్ళు. బరువు 1500 కిలోలు. పొడవు 15 అడుగులు, ఎత్తు 5.6 అడుగులు. ప్రతిరోజు దీని ఆహారం ఖర్చు రోజుకు రూ.2,500-3,000. రోజూ 10 కిలోల ఆపిల్, 8 లీటర్ల పాలు, కిలో బెల్లం, 2 కిలోల చొప్పున కందిపప్పు, శనగపప్పు తదితరాలు అందిస్తారు. నిత్యం రెండుమార్లు స్నానం చేయించి కిలోన్నర ఆవ నూనెతో మసాజ్ చేస్తారు. సర్తాజ్ వయసు ఏడేళ్ళు. బరువు 1600 కిలోలు, ఎత్తు 7 అడుగులు, పొడవు 15 అడుగులు. ఈ దున్నకు కింగ్‌లాగే ఖర్చు చేస్తారు. సదర్ ఉత్సవాలు ఈ ఖరీదైన దున్నపోతులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. వాటి కొమ్ములను కూడా అందంగా తీర్చిదిద్దుతారు.
తాజావార్తలు
-
Sundar Pichai Booed at Stanford: సుందర్ పిచాయ్‌కి షాక్.. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థుల నిరసన
-
Malaria Outbreak: మన్యంలో మలేరియా.. ఆందోళన చెందుతున్న గిరిజనులు!
-
SIR in Telangana: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..!
-
Kollywood Movie Updates : తమిళ హీరోలకు రెమ్యూనరేషన్ కష్టాలు… నిన్న అజిత్ నేడు విక్రమ్
-
Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు చుక్కలే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
ట్రెండింగ్
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!