ఆ వ్యక్తి వయసుల 70 ఏళ్లు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన ఈ వయసులో దుర్భుద్ధి ప్రవేశపెట్టాడు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి 38.73లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. హైదరాబాద్ కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70)ని హనీ ట్రాప్‌లో ఇరికించి రూ. 38.73లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు.
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, జనవరి 2025లో 99.67 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది. వీటిలో 13.27 లక్షల ఖాతాలను వినియోగదారు నివేదిక లేకుండానే నిషేధించారు. కంపెనీ ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ భద్రతను బలోపేతం చేయడానికి, స్పామ్, స్కామ్‌లను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నారు.
Online Love Scam: ఈ డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ వలన పరస్పర సంబంధాలు సులభంగా ఏర్పడుతున్నప్పటికీ, దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరిచయమై, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఫిలింనగర్‌లో ఇలాంటి ఒక వింత కేసు నమోదైంది. Read Also: Ganga River: గంగా నదికి ప్రకృతి వరం.. నీటి స్వచ్ఛతను…
ఆన్‌లైన్‌లో గేమ్స్ ద్వారా పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి మాయమాటలతో మోసపోయింది. ఆ బాలికను లొంగదీసుకుని ఆన్‌లైన్‌లో చాటింగ్‌లో స్వీట్ మెస్సేజ్‌లతో ఆమెను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా.. ఆమె ఫోటోలను తనకు షేర్ చేయాలని కోరాడు. దీంతో ఆ బాలిక తన ఫోటోలను ఆ వ్యక్తికి పంపించింది. ఆమె పంపించిన స్నాప్‌చాట్‌లో న్యూడ్ ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. దీంతో.. తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బాలికను బ్లాక్‌మెయిల్ చేశాడు యువకుడు ఖష్‌దేవ్.
సైబర్ నేరాల నివారణ కోసం సైబరాబాద్ పోలీసులు P.R.O.T.E.C.T పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీస్ రూపొందించిన P.R.O.T.E.C.T(ప్రొటెక్ట్) అనే ప్రాజెక్ట్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌లు లాంచనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ డిజిటల్ ప్రపంచంలో పౌరులకు అవగాహన కల్పించడం, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పని చేయనుంది.