INDGAP Certification : ఇండ్ గ్యాప్ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDGAP Certification : ఇండ్ గ్యాప్ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా మన రాష్ట్ర అన్నదాతలు కష్టపడి నాణ్యమైన ప్రమాణాలతో పండించిన పంట దిగుబడులను తమకు జారీ చేసిన ధృవీకరణ పత్రముల ఆధారంగా ప్రీమియం ధరకు వారికి నచ్చిన చోట దేశీయంగా మాత్రమే కాకుండా యూరప్, యూఎస్‌తో సహా వందకు పైగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి వ్యాపారం చేసుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది.. మన దేశంలోని రైతులకు ఇచ్చే గ్యాప్ సర్టిఫికేషన్‌ను ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్‌గా ఇతర దేశాలు గుర్తిస్తాయి. రానున్న రోజుల్లో ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ ప్రమాణాలను గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ ప్రమాణాలతో సరిసమానం చేయడం జరుగుతుంది. అప్పుడు రైతులు పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో వాణిజ్యపరమైన డిమాండ్ అధికంగా ఏర్పడుతుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
- Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
- Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
భారతదేశంలో మేలైన వ్యవసాయ పద్దతులను బలోపేతం చేసే సదుద్దేశంతో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇండ్ గ్యాప్ ధృవీకరణ పథకాన్ని అభివృద్ది చేసింది. దీనిని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేశారు. గ్యాప్ సర్టిఫికేషన్‌లో భాగంగా పండ్లు, కూరగాయలు, సంయోగ పంటలు, తేయాకు, గ్రీన్ కాఫీ, సుగంధ ద్రవ్యాలు అనే ఐదు విభాగాలుగా ధృవీకరణ చేయడం జరుగుతుంది. ఈ ధృవీకరణను వ్యక్తిగత రైతులు, రైతు బృందాల చేత చేయించవచ్చు. మన రాష్ట్రంలో ఇండ్ గ్యాప్ ధృవీకరణ పథకం కింద ఏపీఎస్‌వోపీసీఏ ధృవీకరణ సేవలు అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇండ్ గ్యాప్ అమలుకోసం సుస్ధిర వ్యవసాయ ఆహార వ్యవస్ధలు అనే శీర్షికతో ఎఫ్‌ఏవో–టీసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒప్పంద పత్రాలను సీఎం సమక్షంలో మార్చుకున్న క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జక్సయ్ షా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.
తాజావార్తలు
-
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
-
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
-
Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
ట్రెండింగ్
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!