ఏపీలో దిగొస్తున్న కోడి…

సాధార‌ణంగా పండుగ రోజుల్లో చికెన్ ధ‌ర‌లు పెరుగుతుంటాయి.  క‌రోనా స‌మ‌యం కాబ‌ట్టి పోష‌కాహారానికి డిమాండ్ పెరిగింది.  పోష‌కాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండోచ్చ‌ని న్యూట్రీషియ‌న్స్ చెప్ప‌డంతో చికెన్‌కు గ‌త కొంత‌కాలంగా పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే.  చికెన్‌కు డిమాండ్ పెర‌గ‌డంతో కోళ్ల పెంప‌కం పెద్ద ఎత్తున చేప‌ట్టారు.  ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో చాలా ప్రాంతాల్లో చికెన్ కు దూరంగా ఉంటారు.  దీంతో కోడి మాంసం వినియోగం త‌గ్గిపోయింది.  కావాల్స‌న్ని కోళ్లు అందుబాటులో ఉన్నా, కోనుగోలు లేక‌పోవ‌డంతో ధ‌ర‌లు ప‌డిపోయాయి.  బాయిల‌ర్ కోడి రైతు వ‌ద్ధ గ‌తంలో రూ.135 వ‌ర‌కు ఉండ‌గా, ఇప్పుడు ఆ ధ‌ర రూ.112 కు ప‌డిపోయింది.  కోళ్లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  ద‌స‌రా త‌రువాత తిరిగి ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

Read: ఆ కారు మ‌ద్యంతోనే న‌డుస్తుంది…

-Advertisement-ఏపీలో దిగొస్తున్న కోడి...

Related Articles

Latest Articles