మా అసోషియేషన్ ఎన్నికలు వివాదం కొనసాగుతూనే ఉంది. ఫలితాలు విడుదలైనప్పటికీ.. మా సభ్యులు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యం లోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మా అసోషియేషన్ వివాదం పై ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రకాశ్ రాజ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ”మా’ సంక్షేమం కోసం.. తమ ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేశారు ప్రకాశ్ రాజ్. ఇవాళ చేసిన తమ సభ్యుల రాజీనామాలను మంచు విష్ణు ఆమోదించాలని ప్రకాష్‌రాజ్ డిమాండ్ చేశారు. తెలుగు వాడు కానీ వాడు కూడా పోటీ చేయడానికి వీలు ఉంది అని మంచు విష్ణు హామీ ఇస్తే.. బై లాస్ మార్చమని చెబితే తన రాజీనామా వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు ప్రకాష్‌రాజ్. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో పూర్తిగా రౌడీ యిజం జరిగిందని ఆరోపించారు.