మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో మళ్లీ రచ్చ మొదలైంది. మా ఎన్నికలు జరిగి నెలరోజులు దాటినా.. కొత్త ప్యానెల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ఓపెన్ చేయడం లేదని కొందరు నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఇలా జరగలేని ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్గం నటీనటులు ఆరోపిస్తున్నారు. మా కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా మూసిఉంటోందని.. దాంతో తాము నిరాశగా వెనుతిరగాల్సి…
‘మా’లో ఇంకా వేడి తగ్గలేదు. గత మూడు నెలల ముందు నుంచే ‘మా’ ఎన్నికల గురించి వస్తున్న వార్తలు హైలెట్ అవుతున్నాయి. అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మంచు విష్ణు ప్యానల్ గెలుపొందింది. గెలుస్తాడనుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోయి రాజీనామా బాట పట్టాడు. ఇక ఆయన ప్యానల్ నుంచి గెలుపొందిన పలువురు సభ్యుల బృందం సైతం రాజీనామాలు చేస్తాము. ‘మా’ మెంబర్స్ గా కొనసాగుతూ మంచు విష్ణు పనితీరును ప్రశ్నిస్తామని…
పలు ఆసక్తికర పరిణామాల మధ్య ఎట్టకేలకు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. పైగా బెనర్జీ వంటి నటులు పలు ఆరోపణలు చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన సందర్భంగా మాజీ ‘మా’ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ “కలిసి పనిచేస్తాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు. బయట ఉండి…
ఆదివారం ‘మా’కు జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి మొత్తం 11 మంది గెలిచారు. ఇందులో ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కాగా, శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైప్ ప్రెసిడెంట్ గా, బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ గా, ఉత్తేజ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా గెలిచిన బ్రహ్మాజీ, సుడిగాలి సుధీర్ తప్ప మిగిలిన గెలిచిన సభ్యులంతా రాజీనామా ప్రకటన సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఓటమి పాలైన జీవిత, హేమ తదితరులు కూడా హాజరయ్యారు.…
మా అసోషియేషన్ ఎన్నికలు వివాదం కొనసాగుతూనే ఉంది. ఫలితాలు విడుదలైనప్పటికీ.. మా సభ్యులు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యం లోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మా అసోషియేషన్ వివాదం పై ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రకాశ్ రాజ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ”మా’ సంక్షేమం కోసం.. తమ ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా…
నిన్న హోరాహోరీగా జరిగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవగా, ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన పరాజయం గురించి మాట్లాడారు. “మా ఎన్నికలు బాగా జరిగాయి. చైతన్యంతో ఎక్కువ మంది ఓట్లు వేశారు. తెలుగు బిడ్డను ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మా ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు అభినందనలు. ప్రాంతీయ వాదం, జాతీయ వాదం మధ్య ఎన్నికలు జరిగాయి. నా తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు. అది నా…
ఈరోజు ఉదయం ‘మా’ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన కాసేపటికే అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ, రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు. దీంతో పోలింగ్ కాసేపు ఆగిపోయింది. తరువాత అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు బృందాలని పిలిపించిన ఎన్నికల అధికారి చర్చలు జరిపారు. Read Also…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న తీరు.. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, విమర్శనాస్త్రాలతో రెండు నెలలపాటు టాలీవుడ్ వాతావరణం వేడెక్కింది. ఇటు ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. లోకల్ – నాన్ లోకల్ వివాదం, మా భవనం, పోస్టల్ బ్యాలెట్ వివాదాలతో పాటుగా మహిళా ఆర్టిస్టులు కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో ఈసారి పోటీదారుల ఫలితంపై ఎన్నడూ లేనంత ఆసక్తి నెలకొంది. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే.. ఓటింగ్…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హేమ వర్సెస్ కరాటే కళ్యాణి మధ్య తీవ్రమైన మాటల యుద్దం నడుస్తోంది. తన ఫోటోలను మార్పింగ్ చేసి తన పరువుతీయాలని చూస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు హేమ ఫిర్యాదు చేసింది. తమ దగ్గర ఏవో ఆధారాలున్నాయని భయపెడుతున్నారంటూ హేమ చెప్పుకొచ్చింది. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని హేమ తెలిపింది. అయితే, తాజాగా హేమ కామెంట్స్ కు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కరాటే కళ్యాణి…
‘మా’ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పోటీదారుల విమర్శలతో ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కు నాగబాబు మద్దతుతో మెగా అండదండలు ఉన్నాయి. తాజాగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ వివాదాలపై ఆయన స్పందించారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్‌రాజ్ కావాలి. ఉత్తమ నటుడిగా ప్రకాష్‌రాజ్‌ను అంతా ఒప్పుకోవాల్సిందేనన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు ఎందుకు..? తెలుగు నటులు…