‘మా’ఓటర్లకు ధన్యవాదాలు.. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.. సాధారణ ఎన్నికల తరహాలో ఎన్నో హైడ్రామాలు నడిచాయి.. మొత్తంగా ఎన్నికల కోలాహలం ముగిసి.. ఫలితాలు కూడా వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అనేక అంశాలు తెరపైకి వచ్చినా.. మా అధ్యక్ష బరిలోకి దిగిన ప్రకాష్‌రాజ్‌పై ఘన విజయం సాధించారు మంచు విష్ణు.. మా ఎన్నికలను రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేస్తున్నారనే చర్చ కూడా సాగింది. అయితే, మా ఎన్నికలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. “మా” అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికీ శుభాకాంక్షలు.. తెలిపిన ఆయన.. ఈ ఎన్నికల్లో జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన “మా” ఓటర్లకు ధన్యవాదాలు.. అంటూ ప్రకాష్‌రాజ్‌పై సెటైర్లు వేశారు.
ఇక, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.. “మా” ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు.. మా ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు.. అందరికి అభినందనలు.. భారత్ మాతాకి జై ! అంటూ ట్వీట్ చేశారు సంజయ్.. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను పలు సందర్భాల్లో బహిరంగంగా వ్యతిరేకించారు ప్రకాష్ రాజ్.. మా ఎన్నికల సమయంలోనూ ప్రకాష్ రాజ్ జాతి వ్యతిరేక శక్తి అనే ఆరోపణలు, విమర్శలు చేశారు చేశారు.. ఇప్పుడు.. తన ట్వీట్‌లో బండి సంజయ్ అదే ప్రస్తావన చేశారు.
Also Read
"మా" అధ్యక్షుడిగా గెలిచిన @iVishnuManchu గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు.
జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన "మా" ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది.#MaaElections2021— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021
తాజావార్తలు
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!