కొత్త భవనాలు నిర్మించినంత మాత్రాన అభివృద్ధి కాదు.. తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌భవరన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అన్నారు. మేధావులు, మహాన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారన్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ ఎంతో అంకితభావం…