కార్తీక మాసం చివరి సోమవారం ఎఫెక్ట్.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో.. ఓవైపు నదీ తీరాలు.. మరోవైపు శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలముకుంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. పలు స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా, ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా..! ఎమ్మెల్యే మాస్ వార్నింగ్..
తెలుగుదేశం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ జోలికి వస్తే.. చర్మం ఒలిచేస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.. నేను బాలయ్య అభిమానిగా చెబుతున్నా అంటూ హెచ్చరించారు.. హిందూపురంలో కొందరు చిల్లర వెధవలు బాలయ్య గురించి మాట్లాడరు… దీంతో, మా వాళ్లు ఆవేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని పేర్కొన్నారు.. అంతేకానీ, బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తాం.. మీకు, మీ అధినేత కూడా ఇదే మా హెచ్చరిక అంటూ హాట్ కామెంట్లు చేశారు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు… కాగా, సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే.. హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.. హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ దీపిక రెడ్డి భర్త వేణు రెడ్డి ఆఫీసు మీద కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉద్దేశిస్తూ వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు వాళ్లకు ఆగ్రహం తెప్పించాయి.. ఈ నేపథ్యంలోనే.. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..
నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. తీర్పుపై ఉత్కంఠ! .
నేడు సుప్రీంకోర్టులో పిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. తెలంగాణ స్పీకర్‌పై బీఆర్ఎస్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అన్ని కేసులను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై 31 న ఆదేశాలిచ్చింది దేశ అత్యున్నత ధర్మాసనం.. ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుందని, మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. మూడు నెలల గడువులోపే అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్ CV ఆనంద్ క్షమాపణలు
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ పై నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు క్షమాపణలు చెప్పాలని CV ఆనంద్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో ట్వీట్స్ చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. గత నెలలో తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు, డిజిటల్ మూవీ కంపెనీలను, మూవీ పైరసీ ముఠలను అరికట్టేందుకు హైదరాబాద్ నగర పోలీసు సైబర్ క్రైమ్ బృందంతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు CV ఆనంద్. ఈ మీటింగ్ కు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, నాగచైతన్య, దిల్‌రాజు మరియు అనేక మంది హీరోలు, నిర్మాతలు హాజరయ్యారు. ఆ విషయాన్ని తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసారు CV ఆనంద్. అయితే ఈ మీటింగ్ బాలకృష్ణను పిలవండి లేదంటే అయన AP అసెంబ్లీలో అడుగుతారుని ఓ నెటిజన్ వ్యగంగా కామెంట్ చేస్తే అందుకు నవ్వుతున్న ఎమోజితో రిప్లై ఇచ్చారు CV ఆనంద్. అదే బాలయ్య అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. సీనియర్ హీరో, మూడు సార్లు ఎమ్మెల్యే అయిన శాసనసభ్యుడి పట్ల అలా కామెంట్ చేయడం సబబు కాదని తమ హీరోకు క్షమాపణలు చెప్పాలని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేసారు.
డీకే.శివకుమార్ రాజీనామా అంటూ పుకార్లు! కర్ణాటకలో ఏం జరుగుతోంది!
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఇదే రకమైన చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తైన సందర్భంగా సిద్ధరామయ్య మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాహుల్‌గాంధీతో సమావేశమై కీలక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో డీకే.శివకుమార్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీమానా చేసినట్లు పుకార్లు నడుస్తున్నాయి. మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో తాజాగా ఇదే అంశంపై డీకే.శివకుమార్ స్పందించారు. తాను పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడినని.. రాజీనామా వార్తలు పుకార్లుంటూ తోసిపుచ్చారు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది పూర్తిగా సిద్ధరామయ్యదేనని.. పార్టీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే ఇది జరుగుతోందని పేర్కొన్నారు. తాను ఢిల్లీ వెళ్లింది రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేను కర్ణాటకకు ఆహ్వానించడానికి వెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 100 కాంగ్రెస్ కార్యాలయాల శంకుస్థాపన చేయబోతున్నామని.. దీనికి ఆహ్వానించేందుకు మాత్రమే ఢిల్లీ వెళ్లినట్లుగా క్లారిటీ ఇచ్చారు.
కాంగోలో కూలిన మైనింగ్ గని వంతెన.. 32 మంది మృతి
ఆగ్నేయ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాగి మైనింగ్ గనిలో వంతెన కూలి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా వీలు లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాంగోలో ఎక్కువగా జీవనోపాధి మైనింగే. దీని మీదే ఆధారపడి జీవిస్తుంటారు. ఎక్కువగా మైనర్లు పని చేస్తుంటారు. అయితే ఈ మైనింగ్ పనుల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. భూగర్భంలో లోతుగా తవ్వడం వల్ల ప్రాణాంతక సంఘటనలు జరుగుతుంటాయి. శనివారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక్కసారి మైనింగ్‌కు సంబంధించిన వంతెన కూలిపోయింది. దీంతో 32 మంది చనిపోగా.. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మైదానంలో భారత్, పాకిస్థాన్ ప్లేయర్స్ మధ్య తీవ్ర ఘర్షణ.. గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారు..?
ఏ క్రీడలోనైనా భారతదేశం vs పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటాయి. క్రికెట్లో ఇరు దేశాల మధ్య మాచ్ హీట్‌ను జనరేట్ చేస్తుంది. ఈ మ్యాచ్ ఏదో ఒక సమయంలో వివాదాలకు కారణమవుతుంది. రెండు ఆసియా దేశాల మధ్య చాలా కాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పహల్గాం దాడి తరువాత భారత్ vs పాక్ మ్యాచ్‌లు తీవ్రం రూపాన్ని దాల్చాయి. ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లలో అనేక వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా భారత్, పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్స్ మైదానంలో గొడవకు దిగిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు ప్లేయర్స్ గల్లాలు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.
తన మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి దుర్గ తేజ్..
సెలబ్రిటీల లైఫ్‌పై.. వారి జీవితంలో జరిగే ముఖ్య ఘట్టాలపై ఎప్పుడూ ఫ్యాన్స్‌కు ఆసక్తి ఉంటుంది.. ఇక, మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అయితే.. మరింత క్రేజ్ ఉంటుంది.. ఇక, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్.. ఈ యంగ్ హీరో పెళ్లి ఎప్పుడు.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంగా.. తన మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చారు సినీ హీరో సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గ తేజ్. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న ఆయన.. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించారు.. “వచ్చే ఏడాదిలో నా వివాహం జరుగుతుంది,” అని తెలిపారు సాయి దుర్గ తేజ్.. నాకు మంచి సినిమాలు, మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చాను. కొత్త సంవత్సరం రాబోతుండగా శ్రీవారి ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకున్నాను” అని పేర్కొన్నారు. ఇక, తన రాబోయే సినిమా గురించి సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది సంబరాల ఏటి గట్టు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.. ఈ చిత్రంపై నాకు మంచి నమ్మకం ఉంది అన్నారు.. కాగా, పాన్-ఇండియా సినిమా ‘సంబరాల ఏటి గట్టు’లో నటిస్తున్నారు ఈ మెగా హీరో.. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచే మంచి క్రేజ్ నెలకొంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ఈ మూవీ కీలక మలుపుగా భావిస్తున్నారు. దర్శకుడు రోహిత్ కేపీ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు.. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ కాగా.. ‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అంటూ చెప్పిన డైలాగ్ గ్లింప్స్‌కే హైలేట్‌గా నిలిచింది.. దీంతో, ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి..
రవితేజ సరసన హీరోయిన్ గా సమంత..?
లవ్, ఎమోషన్, త్యాగం దర్శకుడు శివ నిర్వాణ మార్క్. నిన్ను, మజిలీ అలాంటి జానర్ లో వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇలాంటి సినిమాలకు ట్రేడ్ మార్క్‌గా శివ నిర్వాణ పేరు ఆ మధ్య కలాంలో మార్మోగింది. కానీ ఆ తర్వాత రూటు మార్చి చేసిన టక్ జగదీశ్, ఖుషి ప్లాప్ అయ్యాయి. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు శివ నిర్వాణ. మాస్ మహారాజతో ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ జానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు. శివ చెప్పిన పాయింట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచేసాడు రవితేజ. అయితే ఈ సినిమాకు సంబంధించి మరొక సూపర్ న్యూస్ టాలీవుడ్ సిర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. శివ నిర్వాణ చేస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా సమంతను ఫిక్స్ చేసారని టాక్. శివ డైరెక్ట్ చేసిన మజిలీ, ఖుషి సినిమాలలో హీరోయిన్ గా నటించింది సమంత. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఇప్పుడు రవితేజ సినిమాలో హీరోయిన్ గా శివ అడగగానే ఒప్పుకుందట సామ్. ఇటీవల కాలంలో సమంత తెలుగులో పూర్తిగా సినిమాలు తగ్గించేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే లేడి ఓరియెంటెడ్ సినిమా మాత్రేమే చేస్తుంది. ఇక ఇప్పడు శివ డైరెక్షన్ చేస్తున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. మైత్రీ మూవీస్ నిర్మాణంలో వస్తున్న ఈసినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ప్రకటన రానుంది.