సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కొనసాగనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగనుంది.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. మరోవైపు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ.. దీంతో, సీఐడీ దాఖలు చేసిన కౌంటర్ ను పరిశీలించి రీజైండర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది.. ఇక, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ .. మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయని పేర్కొన్నారు అభిషేక్ సింఘ్వీ.. అయితే, ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
గ్రేటర్ విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక..
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్‌గా టీడీపీకి చెందిన పీలా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. శ్రీనివాసరావు పేరును జనసేన ప్రతిపాదించగా.. బీజేపీ బలపరిచింది.. పీలా అభ్యర్థిత్వాన్ని ముక్తకంఠంతో ఆమోదించింది కౌన్సిల్.. ఇక, మేయర్ ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.. నూతన మేయర్ పీలా శ్రీనివాసరావుతో ప్రమాణం చేయించారు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్.. దీంతో, ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగరేయాలన్న టీడీపీ కల ఎట్టకేలకు నెరవేరింది. ఏడాది కాలపరిమితి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించారు.. మేయర్ అభ్యర్ధిగా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ బీఫార్మ్ ను పీలాకు అందజేశారు నగర పార్టీ అధ్యక్షుడు గండిబాబ్జీ. ఈ రోజు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది.. 98 వార్డులతో వున్న మహా విశాఖ నగర పాలక పీఠం దక్కించుకోవడం రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి వున్న స్టీల్ సిటీ పై పట్టు సాధించాలంటే మేయర్ పీఠం కీలకం. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి విశాఖ కంచుకోటే అయినప్పటికీ స్ధానిక సంస్ధలపై ఆజిమాయిషీ చేసే ఛాన్స్ లభించలేదు. 2011లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. నలుగురు ఎమ్మెల్యేల బలం వుండి కూడా టీడీపీ 28 స్థానాలకు పరిమితం అయింది.
వైసీపీకి షాక్.. టీడీపీ ఖాతాలో కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్న కుప్పం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది టీడీపీ.. చివరి నిమిషంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో టీడీపీ ఖాతాలోకి కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం చేరిపోయింది.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చివరి నిమిషంలో.. వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరుకున్నారు నలుగురు కౌన్సిలర్లు.. దీంతో.. టీడీపీకి మద్దతు తెలిపిన సభ్యుల సంఖ్య 15 మందికి చేరింది.. 6 వార్డు నుంచి ప్రానిథ్యం వహిస్తోన్న వన్నియకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన సెల్వరాజు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.. కుప్పం మున్సిపాలిటీ తమ ఖాతాలో పడడంతో.. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సంబరాలు చేసుకున్నారు కూటమి నేతలు..
గుంటూరు కొత్త మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర..
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా మేయర్ ఎన్నికల బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర.. 34 ఓట్లతో గెలుపొందరు.. కోవెలమూడి రవీంద్రకు అనుకూలంగా 34 ఓట్లు రాగా.. వైసీపీ తరపున పోటీకి దిగిన అచ్చాల వెంకట రెడ్డికి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి.. దీంతో.. గుంటూరు మేయర్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో.. మేయర్ గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు.. మేయర్ ఎన్నిక సందర్భంగా కార్పొరేషన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సిల్ లో మొత్తం 63 మందిలో 32 ఓట్లు సాధిస్తే మేయర్ పీఠం దక్కించుకోవచ్చు. కానీ, కూటమి అభ్యర్థిగా 34 ఓట్లు వచ్చాయి.. దీంతో టీడీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.. ఆ తర్వాత కోవెలమూడి రవీంద్రతో మేయర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు..
విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి ఎప్ సెట్
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ , అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్ (EAPCET) పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షకు ఈ సంవత్సరం మొత్తం 3,06,796 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 29 , 30 తేదీల్లో అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్‌లకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత, మే 2వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు రోజూ రెండు సెషన్లలో నిర్వహించబడతాయి. ఈసారి ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు 2,20,049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్‌లకు 86,493 మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా అవకాశం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఈసారి ఆ అవకాశం లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య కాస్త తగ్గింది.
మ.3 గంటలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ.. ఏం జరుగుతోంది!
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర పెద్దలు భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సైన్యం సన్నద్ధత గురించి ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహన్తో రాజ్‌నాథ్ ఆదివారం భేటీ అయ్యారు. ఆ సమావేశంలో మన సైన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రక్షణమంత్రి ప్రధానికి వివరించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ భేటీ తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రక్షణపై చర్చించనున్నారు. ప్రధాని మోడీతో రాజ్‌నాథ్‌సింగ్ చర్చించిన అంశాలు.. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట సాగిస్తున్నాయి. ఈ అంశంపై కూడా చర్చకు వచ్చే ఛాన్సుంది. ఢిల్లీలో వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తుర్కియే సైనిక విమానాలు పాక్‌లో మోహరించాయి. పాక్ సైన్యానికి అవసరమైనవి చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం సురిందర్ చౌదరి తీర్మానం ప్రవేశపెట్టారు. ముక్తకంఠంతో శాసనసభ ఉగ్రదాడిని ఖండించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఘటన దారుణం అని సభ పేర్కొంది. పిరికి చర్యగా అభివర్ణించింది. బాధితులకు, వారి కుటుంబాలకు సభ సంఘీభావం తెలిపింది. ఇక పర్యాటకులను రక్షించడానికి ధైర్మంగా ముందుకొచ్చి ప్రాణాలు అర్పించిన షహీద్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ త్యాగానికి సభ వందనం చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. తాజాగా పాక్‌కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక భేటీ.. ఉత్కంఠ రేపుతున్న చర్చలు
ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న పాక్ సైన్యం కాల్పులపై సీడీఎస్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్.. రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చించారు. ఒక్కరోజు భేటీ తర్వాత రాజ్‌నాథ్ సింగ్.. ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రతా సిబ్బంది సంసిద్ధత గురించి ప్రధానికి రాజ్‌నాథ్‌సింగ్ వివరించనున్నారు. పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి సైన్యం తీసుకున్న కీలక నిర్ణయాలను మోడీకి వివరించనున్నారు. గత నాలుగు రోజులుగా పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ దళాలు కాల్పులకు తెగబడుతున్నాయి. భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటూ తిప్పికొడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చిస్తున్నారు.
బీబీసీ తప్పుడు కథనాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ కేంద్రం లేఖ
పహల్గామ్ ఉగ్ర దాడిపై అంతర్జాతీయ మీడియా పక్షపాతం ప్రదర్శిస్తోంది. పాకిస్థాన్‌కు అనుకూలంగా.. భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికే ది న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఉగ్ర దాడిని మిలిటెంట్ దాడిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో పట్టపగలు ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 26 మందిని హతమార్చారు. కళ్ల ముందు ఇంత స్పష్టంగా ఘోరం కనిపించింది. ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ఉగ్ర దాడిని ఖండిస్తుంటే.. న్యూయార్క్ టైమ్స్ మాత్రం తప్పుగా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. మిలిటెంట్ కాదు టెర్రరిస్ట్ దాడి అని సరి చేసింది. తాజాగా బీబీసీ కూడా అదే జాబితాలో చేరింది. ‘కాశ్మీర్లో జరిగిన దాడి తర్వాత పాకిస్థాన్ వీసాలను భారతదేశం రద్దు చేసింది’ అనే శీర్షికతో బీబీసీ కథనం ప్రచురించి.. అందులో పహల్గామ్ దాడిని మిలిటెంట్ దాడిగా పేర్కొంది. ఈ కథనంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ఇలాంటి పక్షపాత ధోరణి ఏంటి? అని ఇండియా బీబీసీ అధిపతి జాకీ మార్టిన్‌కు కేంద్రం లేఖ రాసింది. వాస్తవాలేంటో పరిశీలించాలని కోరింది. ఈ మేరకు పహల్గామ్ దాడికి సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ పంపించింది. పహల్గామ్ దాడిపై బీబీసీ ఉద్దేశాలేంటో పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
శర్వాకు జోడిగా ప్లాప్ హీరోయిన్
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. శర్వా సినీ కెరీర్ లో 38వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో, సాంకేతిక ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంపత్ నంది, రాధామోహన్ కాంబోలో సిటిమార్ తర్వాత వస్తున్న రెండవ సినిమా ఇది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలో శర్వానంద్ మునుపెన్నడు కనిపించను లుక్ లో కనిపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కాగా సినిమాలో శర్వా కు జోడీగా ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ ఆన్ బోర్డ్ చేసారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఈ మరో హీరోయిన్ ను కూడా తీసుకున్నట్టు ప్రకటించారు. ఖిలాడీ, రామా బాణం సినిమాలలో నటించిన భామ డింపుల్ హయతిని శర్వా సినిమా కోసం తీసుకున్నట్టు ప్రకటించారు మేకర్స్. తెలంగాణ నేపథ్యంలో పిరియాడికల్ యాక్షన్ నేపధ్యంలో రానున్నఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో తీసుకురాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం శర్వా నారి నారి నడుమ మురారి, అలాగే యువీ క్రియేషన్స్ లోను మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశకు చురుకున్నాయి. త్వరలోనే సంపత్ నంది సినిమా రెగ్యులర్ షూట్ లో జాయిన్ కానున్నాడు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో శర్వా 38కు సంగీతం అందిస్తున్నాడు.
మృణాల్ ఠాకూర్ కు తీవ్ర అవమానం.. స్టార్ కిడ్ పై సంచలన ఆరోపణలు
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మారాఠి చిత్రాలతో హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ 30, జెర్సీ వంటి వంటి చిత్రాలతో హిందీలోనూ సెన్సేషనల్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత తెలుగు లోకి అడుగుపెట్టింది. దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘సీతారమం’ లో నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో మృణాల్ ఇరగదీసింది. తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకుంది. ప్రజంట్ మళ్లీ హిందీలో వరుస చిత్రాలు చేస్తునే.. ఇటు తెలుగులోనూ భారీ చిత్రాల్లో స్టార్ హీరోలకు జోడీగా అవకాశాలను అందుకుంటుంది. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో మృణాల్ పేరు మారుమోగుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా తనకు సంబంధించిన ఓ ఇబ్బంది కరమైన విషయాన్ని ఇంటర్వ్యూలో వెల్లడించింది మృణాల్.. రీసెంట్గా క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ విభాగంలో అవార్డులను అందుకున్న సందర్భంగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఓ వేడుకకు హాజరయ్యారట.