ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్
ఇవాళ నంద్యాలలో బహిరంగ చర్చ కు సవాల్ చేశారు భూమా అఖిల ప్రియ. ఇప్పటికే భూమా అఖిల ప్రియ బహిరంగ చర్చపై నోటీసులు ఇచ్చారు పోలీసులు. బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శిల్పా రవికి సవాల్ చేశారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. సాయంత్రం 4 గంటలకు గాంధీ చౌక్ వద్ద చర్చకు రావాలని ఏర్పాట్లు చేశారు భూమా అఖిల ప్రియ. 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఈ బహిరంగచర్చకు అనుమతి లేదని, అనుమతి లేకుండా ఏర్పాట్లు చేస్తున్నందున ఎందుకు చర్య తీసుకోరాదని నోటీసుల్లో పేర్కొన్నారు. భూమా అఖిల ప్రియ వ్యక్తిగత సహాయకునికి కూడా నోటీస్ ఇచ్చారు పోలీసులు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి.నంద్యాలలో రాజకీయం రసకందాయంలో పడింది. మాజీ మంత్రి భూమా అఖిల చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి. ఎమ్మెల్యే శిల్పా రవిని భూమా అఖిల చిక్కుల్లో పడేసిందంటున్నారు. మాజీ మంత్రి భూమా అఖిల నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు నంద్యాలలో హీట్ పెంచాయంటున్నారు. టీడీపీ లో, వైసీపీ లో చర్చకు తెరతీసాయంటున్నారు. భూమా అఖిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా.? రాజకీయ క్రీడలో భాగంగా శిల్పా రవి కుటుంబంపై వ్యాఖ్యలు చేసారా అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే శిల్ప కుటుంబం టీడీపీపి వైపు చూస్తుందంటూ భూమా అఖిల సంచలన వ్యాఖ్యలు చేసి వదిలేశారు. వైసీపీలో శిల్పా కుటుంబ పరిస్థితి బాగాలేదని, పార్టీతో బంధం చెడిందని భూమా అఖిల మీడియా ముందు బయటపెట్టారు.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం, అదుపులోకి రాని మంటలు
నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని టర్బే డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుపక్కలకు భారీగా వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటలు వ్యాపిస్తుండటంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
మొబైల్ లో గేమ్స్ ఆడుకుంటున్నాడులే అనుకున్నాడు.. కానీ
కరోనా మహమ్మారి పుణ్యమా అని పిల్లలకు విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ చేశాయి. దీంతో పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్లు తప్పనిసరి అయ్యాయి. దీంతో చాలామంది పిల్లలు క్లాసుల సంగతి ఏమో గానీ ఫోన్ కు మాత్రం బాగానే అడిక్ట్ అయ్యారు. క్లాస్ జరిగే సమయం మినహా మిగతా టైం అంతా ఆ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. కొందరి పిల్లల తల్లిదండ్రులు కూడా వారు ఫోన్ చూస్తుంటే క్లాస్ వింటున్నాడులే అని పట్టించుకుంటలేరు. అలాగే అమెరికాలో ఓ తండ్రి కొడుకుపై కన్నేయకపోవడంతో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అమెరికాలోని మెట్రో డెట్రాయిట్, చెస్టర్ఫీల్డ్ టౌన్ షిప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొడుకు స్మార్ట్ ఫోన్ పట్టుకుని బెడ్ పై కూర్చుకున్నాడు. అతడు మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నాడేమోనని ఆ బాలుడి తండ్రి భావించాడు. అయితే, ఆ బాలుడు ఫుడ్ డెలివరీ యాప్ లో తెలిసీతెలియక ఏకంగా దాదాపు రూ.80 వేల ఆహార పదార్థాల ఆర్డర్ ఇచ్చాడు. ఒక దాని తర్వాత మరొకటి ఇలా ఇంటికి వరుసగా ఆహారపదార్థాలు రావడంతో తండ్రి షాక్ అయ్యాడు. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.80 వేలు కట్ అయ్యాయని తెల్సుకుని కంగుతిన్నాడు. తన స్మార్ట్ ఫోన్ తీసుకుని చూశాక ఆ తండ్రికి అసలు విషయం తెలిసింది.
Read Also:Vidadala Rajini: క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
తెల్లారితే ఎగ్జామ్.. కష్టపడి చదివాడు.. కళ్లెదుటే చనిపోయాడు
తన కొడుకు డాక్టర్ అవుతాడని పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంటి దగ్గర ఉంటే డిస్టర్బెన్స్ అవుతుందని ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. నీట్ ఎగ్జామ్ కోసం కష్టపడి చదువుతున్నాడు. కానీ.. ఊహించకుండా కళ్లెదుటే కనుమూశాడు. రాజస్తాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ప్రమాదవ శాత్తు 6వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. దీంతో అతడి ఫ్రెండ్స్ షాక్ కి గురయ్యారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇషాంషు భట్టాచార్య అనే విద్యార్థి నీట్ కోచింగ్ కోసం కోటాలోని కోచింగ్ ఇన్ స్టిట్యూట్ కు వచ్చాడు. హాస్టల్ లో ఉంటున్నాడు. కాగా, అదే హాస్టల్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో అతడు తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు. తమ కళ్ల ముందే భట్టాచార్య కిందకి పడి చనిపోవడం ఫ్రెండ్స్ ను షాక్ కి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది మామూలు కుక్క కాదు.. గిన్నిస్ బుక్ రికార్డు
ఈ కుక్క పేరు బాబీ. ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీని పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న కుక్క. దీని వయసు ఎంతో తెలిస్తే మీరు షాక్ అయిపోవాల్సిందే. దీని వయసు అక్షరాలా 30ఏళ్ల 266 రోజులు. అంటే సుమారుగా 31 సంవత్సరాలు. అసలు కుక్కలు మా అంటే 10 ఏళ్లు లేదంటే కొన్నైతే 15 ఏళ్ల వరకు బతుకుతాయి. అంతకుమించి అవి బతకలేవు. కానీ.. ఈ కుక్క ఏకంగా 30 ఏళ్లు దాటినా ఇంకా ధృడంగా ఉంది. అత్యంత ఎక్కువ వయసుతో ఉండి బతికి ఉన్న కుక్కగా మరో రికార్డు కూడా ఇది క్రియేట్ చేసింది. ఈ రికార్డు బ్లూయే అనే కుక్క పేరు మీద ఉండేది. ఆ కుక్క 1910లో పుట్టి 1939లో చనిపోయింది. అంటే ఆ కుక్క 29 ఏళ్లు మాత్రమే బతికింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసి 30 ఏళ్ల బతికి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది బాబీ. దీని పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించి దానికి సర్టిఫికెట్ కూడా అందించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.
క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
ఏపీలో వైద్యరంగంలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. మహమ్మారిగా మారుతున్న క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి విడదల రజనీ. ఆర్కే బీచ్ లో కాన్సర్ అవగాహన వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్ లో పాల్గొన్న మంత్రి విడదల రజని ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఏపీ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలను క్యాన్సర్ నివారణకు కేటాయించామన్నారు.కర్నూలులో 120 కోట్లతో క్యాన్సర్ కేర్ యూనిట్ ఏర్పాటు జరుగుతుంది. విశాఖ కేజీహెచ్ లో 60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్ కు గురవుతున్నారు. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు చేసిందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు మంత్రి విడదల రజని.
గుడిసెలో నివసించే మహిళ… మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్
భారతదేశాన్ని ‘శ్రీ అన్న’ (మిల్లెట్స్) సాగు, పరిశోధనలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న తరుణంలో, 27 ఏళ్ల బైగా గిరిజన మహిళ లహరీ బాయి నిజమైన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉద్భవించింది. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు అధికంగా ఉండే డిండోరి జిల్లాలో ముతక ధాన్యాలను సాగు చేస్తూ మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది.మధ్యప్రదేశ్‌లోని దిండోరికి చెందిన 27 ఏళ్ల గిరిజన మహిళ లహరీ బాయి తన ‘బీజ్ బ్యాంక్’తో మిల్లెట్స్‌కు గ్రాస్‌రూట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగింది. లహరి తన యుక్తవయసులో మిల్లెట్ విత్తనాల రకాలను సేకరించడం, సంరక్షించడం ప్రారంభించినప్పుడు తన సొంత బైగా గిరిజన సంఘం తనను తరచుగా ఎగతాళి చేసేదని గుర్తుచేసుకుంది. లహరి తన తల్లిదండ్రులతో ఓ చిన్న గుడిసె ఇంట్లో ఉంటోంది. ఒక గది లివింగ్ రూమ్, కిచెన్‌గా పనిచేస్తుండగా, మరొకటి మిల్లెట్ పంటల ‘బీజ్ బ్యాంక్’గా మార్చబడింది, ఇది వివిధ ముతక ధాన్యాల 30-ప్లస్ అరుదైన విత్తనాలను సంరక్షిస్తుంది.
జంబలకిడి పంబ.. ప్రెగ్నెంట్ అయిన అబ్బాయి
అబ్బాయి.. తండ్రి కాబోతున్నాడు అనడానికి.. అబ్బాయి బిడ్డకు జన్మనిస్తున్నాడు అనడానికి చాలా తేడా ఉంది.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కచ్చితంగా అబ్బాయి బిడ్డకు జన్మనిస్తున్నాడు అనే దాని గురించే.. వినగానే ఏంటి.. ఇదెక్కడి విడ్డూరం.. అబ్బాయి బిడ్డకు జన్మనేలా ఇస్తాడు.. అని ఆశ్చర్యపోకండి.. కేరళలో ఒక ట్రాన్స్ జెండర్ కపుల్.. తమ కళను సాకారం చేసుకోబోతున్నారు. నిజంగానే ఒక అబ్బాయి.. ప్రెగ్నెంట్ అయ్యాడు. ఎలా.. అంటే.. కేరళకు చెందిన జహద్ ఒక అమ్మాయి. చిన్నతనం నుంచి ఆమెకు అమ్మాయిలంటే ఆకర్షణ ఉండేది. దీంతో ఆమె ట్రాన్స్ జెండర్ గా మారింది. ఇక మరోపక్క జియా.. ఒక అబ్బాయి.. అతనికి చిన్నతనం నుంచి అబ్బాయిలు అంటే కోరిక ఉండేది. దీంతో అతను.. ఆమెగా మారాడు. జియా, జహాద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందరి తల్లిదండ్రులను చూసి వారు కూడా తల్లిదండ్రులు కావాలని ఆశపడ్డారు. ఎంతోమంది వద్ద బిడ్డను దత్తతను తీసుకోవడానికి ప్రయత్నించినా తాము ట్రాన్స్ జెండర్స్ అని ఇవ్వడం లేదని వారు చెప్పుకొచ్చారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం
రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం అయిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఘోర ప్రమాదం జరిగింది. అనాతవరం సచివాలయం ముందు నిలిపిఉంచిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం అయింది. బస్సులో మంటలు వ్యాపించడంతో వెంటనే అలర్ట్ అయ్యాడు బస్ డ్రైవర్. దీంతో సురక్షితంగా బయటపడ్డాడు డ్రైవర్, స్దానికుల సమాచారంతో మంటలార్పారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ ఒక్కరే ఉన్నాడు.. వెంటనే అప్రమత్తమై బయటకు దూకేశాడు స్దానికుల సమాచారంతో మంటలార్పారు అగ్నిమాపక సిబ్బంది, బస్సు దగ్దం కావడానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఎవరైనా నిప్పు పెట్టారా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.