Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Ntv Top Headlines February 04 2023 At 9am

Top Headlines @9AM: టాప్ న్యూస్

Published Date :February 4, 2023 , 9:00 am
By NTV WebDesk
Top Headlines @9AM: టాప్ న్యూస్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

Akhila 1

Also Read

  • Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌
  • Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌
  • Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌
  • Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌
Add as a preferred
source on google

ఇవాళ నంద్యాలలో బహిరంగ చర్చ కు సవాల్ చేశారు భూమా అఖిల ప్రియ. ఇప్పటికే భూమా అఖిల ప్రియ బహిరంగ చర్చపై నోటీసులు ఇచ్చారు పోలీసులు. బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శిల్పా రవికి సవాల్ చేశారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. సాయంత్రం 4 గంటలకు గాంధీ చౌక్ వద్ద చర్చకు రావాలని ఏర్పాట్లు చేశారు భూమా అఖిల ప్రియ. 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఈ బహిరంగచర్చకు అనుమతి లేదని, అనుమతి లేకుండా ఏర్పాట్లు చేస్తున్నందున ఎందుకు చర్య తీసుకోరాదని నోటీసుల్లో పేర్కొన్నారు. భూమా అఖిల ప్రియ వ్యక్తిగత సహాయకునికి కూడా నోటీస్ ఇచ్చారు పోలీసులు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి.నంద్యాలలో రాజకీయం రసకందాయంలో పడింది. మాజీ మంత్రి భూమా అఖిల చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి. ఎమ్మెల్యే శిల్పా రవిని భూమా అఖిల చిక్కుల్లో పడేసిందంటున్నారు. మాజీ మంత్రి భూమా అఖిల నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు నంద్యాలలో హీట్ పెంచాయంటున్నారు. టీడీపీ లో, వైసీపీ లో చర్చకు తెరతీసాయంటున్నారు. భూమా అఖిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా.? రాజకీయ క్రీడలో భాగంగా శిల్పా రవి కుటుంబంపై వ్యాఖ్యలు చేసారా అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే శిల్ప కుటుంబం టీడీపీపి వైపు చూస్తుందంటూ భూమా అఖిల సంచలన వ్యాఖ్యలు చేసి వదిలేశారు. వైసీపీలో శిల్పా కుటుంబ పరిస్థితి బాగాలేదని, పార్టీతో బంధం చెడిందని భూమా అఖిల మీడియా ముందు బయటపెట్టారు.

ముంబైలో భారీ అగ్నిప్రమాదం, అదుపులోకి రాని మంటలు

Fire In Mumbai

నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని టర్బే డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుపక్కలకు భారీగా వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటలు వ్యాపిస్తుండటంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

మొబైల్ లో గేమ్స్ ఆడుకుంటున్నాడులే అనుకున్నాడు.. కానీ

New Project 34

కరోనా మహమ్మారి పుణ్యమా అని పిల్లలకు విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ చేశాయి. దీంతో పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్లు తప్పనిసరి అయ్యాయి. దీంతో చాలామంది పిల్లలు క్లాసుల సంగతి ఏమో గానీ ఫోన్ కు మాత్రం బాగానే అడిక్ట్ అయ్యారు. క్లాస్ జరిగే సమయం మినహా మిగతా టైం అంతా ఆ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. కొందరి పిల్లల తల్లిదండ్రులు కూడా వారు ఫోన్ చూస్తుంటే క్లాస్ వింటున్నాడులే అని పట్టించుకుంటలేరు. అలాగే అమెరికాలో ఓ తండ్రి కొడుకుపై కన్నేయకపోవడంతో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అమెరికాలోని మెట్రో డెట్రాయిట్, చెస్టర్ఫీల్డ్ టౌన్ షిప్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కొడుకు స్మార్ట్ ఫోన్ పట్టుకుని బెడ్ పై కూర్చుకున్నాడు. అత‌డు మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నాడేమోన‌ని ఆ బాలుడి తండ్రి భావించాడు. అయితే, ఆ బాలుడు ఫుడ్ డెలివ‌రీ యాప్ లో తెలిసీతెలియ‌క‌ ఏకంగా దాదాపు రూ.80 వేల ఆహార ప‌దార్థాల ఆర్డర్ ఇచ్చాడు. ఒక దాని త‌ర్వాత మ‌రొక‌టి ఇలా ఇంటికి వ‌రుస‌గా ఆహారపదార్థాలు రావడంతో తండ్రి షాక్ అయ్యాడు. త‌న బ్యాంకు అకౌంట్ నుంచి రూ.80 వేలు క‌ట్ అయ్యాయని తెల్సుకుని కంగుతిన్నాడు. త‌న స్మార్ట్ ఫోన్ తీసుకుని చూశాక ఆ తండ్రికి అస‌లు విష‌యం తెలిసింది.

Read Also:Vidadala Rajini: క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

తెల్లారితే ఎగ్జామ్.. కష్టపడి చదివాడు.. కళ్లెదుటే చనిపోయాడు
తన కొడుకు డాక్టర్ అవుతాడని పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంటి దగ్గర ఉంటే డిస్టర్బెన్స్ అవుతుందని ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. నీట్ ఎగ్జామ్ కోసం కష్టపడి చదువుతున్నాడు. కానీ.. ఊహించకుండా కళ్లెదుటే కనుమూశాడు. రాజస్తాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ప్రమాదవ శాత్తు 6వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. దీంతో అతడి ఫ్రెండ్స్ షాక్ కి గురయ్యారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇషాంషు భట్టాచార్య అనే విద్యార్థి నీట్ కోచింగ్ కోసం కోటాలోని కోచింగ్ ఇన్ స్టిట్యూట్ కు వచ్చాడు. హాస్టల్ లో ఉంటున్నాడు. కాగా, అదే హాస్టల్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో అతడు తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు. తమ కళ్ల ముందే భట్టాచార్య కిందకి పడి చనిపోవడం ఫ్రెండ్స్ ను షాక్ కి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది మామూలు కుక్క కాదు.. గిన్నిస్ బుక్ రికార్డు

Bobby

ఈ కుక్క పేరు బాబీ. ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీని పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న కుక్క. దీని వయసు ఎంతో తెలిస్తే మీరు షాక్ అయిపోవాల్సిందే. దీని వయసు అక్షరాలా 30ఏళ్ల 266 రోజులు. అంటే సుమారుగా 31 సంవత్సరాలు. అసలు కుక్కలు మా అంటే 10 ఏళ్లు లేదంటే కొన్నైతే 15 ఏళ్ల వరకు బతుకుతాయి. అంతకుమించి అవి బతకలేవు. కానీ.. ఈ కుక్క ఏకంగా 30 ఏళ్లు దాటినా ఇంకా ధృడంగా ఉంది. అత్యంత ఎక్కువ వయసుతో ఉండి బతికి ఉన్న కుక్కగా మరో రికార్డు కూడా ఇది క్రియేట్ చేసింది. ఈ రికార్డు బ్లూయే అనే కుక్క పేరు మీద ఉండేది. ఆ కుక్క 1910లో పుట్టి 1939లో చనిపోయింది. అంటే ఆ కుక్క 29 ఏళ్లు మాత్రమే బతికింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసి 30 ఏళ్ల బతికి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది బాబీ. దీని పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించి దానికి సర్టిఫికెట్ కూడా అందించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.

క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Vidadala Rajini

ఏపీలో వైద్యరంగంలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. మహమ్మారిగా మారుతున్న క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి విడదల రజనీ. ఆర్కే బీచ్ లో కాన్సర్ అవగాహన వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్ లో పాల్గొన్న మంత్రి విడదల రజని ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఏపీ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలను క్యాన్సర్ నివారణకు కేటాయించామన్నారు.కర్నూలులో 120 కోట్లతో క్యాన్సర్ కేర్ యూనిట్ ఏర్పాటు జరుగుతుంది. విశాఖ కేజీహెచ్ లో 60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్ కు గురవుతున్నారు. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు చేసిందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు మంత్రి విడదల రజని.

గుడిసెలో నివసించే మహిళ… మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్

Millets

భారతదేశాన్ని ‘శ్రీ అన్న’ (మిల్లెట్స్) సాగు, పరిశోధనలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న తరుణంలో, 27 ఏళ్ల బైగా గిరిజన మహిళ లహరీ బాయి నిజమైన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉద్భవించింది. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు అధికంగా ఉండే డిండోరి జిల్లాలో ముతక ధాన్యాలను సాగు చేస్తూ మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది.మధ్యప్రదేశ్‌లోని దిండోరికి చెందిన 27 ఏళ్ల గిరిజన మహిళ లహరీ బాయి తన ‘బీజ్ బ్యాంక్’తో మిల్లెట్స్‌కు గ్రాస్‌రూట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగింది. లహరి తన యుక్తవయసులో మిల్లెట్ విత్తనాల రకాలను సేకరించడం, సంరక్షించడం ప్రారంభించినప్పుడు తన సొంత బైగా గిరిజన సంఘం తనను తరచుగా ఎగతాళి చేసేదని గుర్తుచేసుకుంది. లహరి తన తల్లిదండ్రులతో ఓ చిన్న గుడిసె ఇంట్లో ఉంటోంది. ఒక గది లివింగ్ రూమ్, కిచెన్‌గా పనిచేస్తుండగా, మరొకటి మిల్లెట్ పంటల ‘బీజ్ బ్యాంక్’గా మార్చబడింది, ఇది వివిధ ముతక ధాన్యాల 30-ప్లస్ అరుదైన విత్తనాలను సంరక్షిస్తుంది.

జంబలకిడి పంబ.. ప్రెగ్నెంట్ అయిన అబ్బాయి

Kerala

అబ్బాయి.. తండ్రి కాబోతున్నాడు అనడానికి.. అబ్బాయి బిడ్డకు జన్మనిస్తున్నాడు అనడానికి చాలా తేడా ఉంది.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కచ్చితంగా అబ్బాయి బిడ్డకు జన్మనిస్తున్నాడు అనే దాని గురించే.. వినగానే ఏంటి.. ఇదెక్కడి విడ్డూరం.. అబ్బాయి బిడ్డకు జన్మనేలా ఇస్తాడు.. అని ఆశ్చర్యపోకండి.. కేరళలో ఒక ట్రాన్స్ జెండర్ కపుల్.. తమ కళను సాకారం చేసుకోబోతున్నారు. నిజంగానే ఒక అబ్బాయి.. ప్రెగ్నెంట్ అయ్యాడు. ఎలా.. అంటే.. కేరళకు చెందిన జహద్ ఒక అమ్మాయి. చిన్నతనం నుంచి ఆమెకు అమ్మాయిలంటే ఆకర్షణ ఉండేది. దీంతో ఆమె ట్రాన్స్ జెండర్ గా మారింది. ఇక మరోపక్క జియా.. ఒక అబ్బాయి.. అతనికి చిన్నతనం నుంచి అబ్బాయిలు అంటే కోరిక ఉండేది. దీంతో అతను.. ఆమెగా మారాడు. జియా, జహాద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందరి తల్లిదండ్రులను చూసి వారు కూడా తల్లిదండ్రులు కావాలని ఆశపడ్డారు. ఎంతోమంది వద్ద బిడ్డను దత్తతను తీసుకోవడానికి ప్రయత్నించినా తాము ట్రాన్స్ జెండర్స్ అని ఇవ్వడం లేదని వారు చెప్పుకొచ్చారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం

Fire 1

రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం అయిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఘోర ప్రమాదం జరిగింది. అనాతవరం సచివాలయం ముందు నిలిపిఉంచిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం అయింది. బస్సులో మంటలు వ్యాపించడంతో వెంటనే అలర్ట్ అయ్యాడు బస్ డ్రైవర్. దీంతో సురక్షితంగా బయటపడ్డాడు డ్రైవర్, స్దానికుల సమాచారంతో మంటలార్పారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ ఒక్కరే ఉన్నాడు.. వెంటనే అప్రమత్తమై బయటకు దూకేశాడు స్దానికుల సమాచారంతో మంటలార్పారు అగ్నిమాపక సిబ్బంది, బస్సు దగ్దం కావడానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఎవరైనా నిప్పు పెట్టారా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • india
  • Movies
  • Sports
  • telangana

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions