ప్రజల్లో పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదు
ప్రజల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదన్నారు మంత్రి ఆర్ కె రోజా. నగరి నియోజవర్గం పూడి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టిన మంత్రి రోజా విపక్షాలపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్. జగన్ ,నన్ను ఓడిస్తారని అనుకోవడం అవివేకం ..కలవాలి ఆలోచన పవన్ కి, చంద్రబాబు ఉంటే కలగకుండా ఎవరైనా చేయగలరా.. ప్రజల్లో పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదు. పార్టీ పెట్టి పవన్ ఏం చేస్తున్నాడు…చంద్రబాబు లా మ్యానిఫెస్టో వెబ్ సైట్ నుండి తీసేయలేదన్నారు రోజా. ఈ కార్యక్రమంలో ఎదురు తిరిగి ప్రశ్నించి మాట్లాడేవారు మూర్ఖులు. జగన్ననే మా భవిష్యత్తు లో ప్రజల నుండి గత ప్రభుత్వ పాలన ఇప్పుడు మా పాలన కు సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకునే కార్యక్రమం..ఐదు అంశాలపై ప్రజల నుండి అభిప్రాయం సేకరించి వారు ఈ ప్రభుత్వంపై విశ్వాసం చూపితే వారి ఇంటికి వారి అనుమతితో మా నమ్మకం నువ్వే జగన్ స్టికర్ ను వారి ఇంటికి అంటిస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ లు ఏర్పాటు చేసి ఏ విధంగా పరిపాలన అందించారో మనం చూసాం..మా ముఖ్యమంత్రి లబ్దిదారుడికి అర్హత ఉంటే చాలు వారికి నేరుగా పధకాలు అందజేయమని చెప్పారన్నారు.
దేశానికి చదువుకున్న ప్రధాని కావాలి.. మోడీకి మనీష్ సిసోడియా లేఖ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాని నరేంద్రమోదీకి జైలు నుంచే లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్ లాగా సిసోడియా కూడా ప్రధాని విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తారు. మనీస్ సిసోడియా రాసిన లేఖను సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ లేఖలో సిసోడియా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. భారత దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని అన్నారు. మురికి కాలువలోని డర్టీ గ్యాస్ ని టీ, ఫుడ్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చని ప్రధాని చెప్పడాన్ని వింటే నా గుండె తరుక్కుపోతోంది, మేఘాల వెనక ఉన్న విమానాలను రాడార్లు గుర్తించలేవనే వ్యాఖ్యలతో పాఠశాల, కళాశాల విద్యార్థులను ప్రధాని ఎగతాళి చేస్తున్నారని సిసోడియా లేఖలో పేర్కొన్నారు. గతంలో నేను పెద్దగా చదువుకోలేదని ప్రధాని చెబుతున్న వీడియోలు చూశానని, తాను గ్రామంలో పాఠశాలలో చదువుకున్నానని అన్నారని, ఒకరు తక్కువగా చదువుకోవడాన్ని గొప్పగా చెబుకుంటారా..? అని ప్రశ్నించారు.
కేరళ రైలు ఘటనలో సంచలన విషయాలు
కేరళలో నడుస్తున్న రైలులో అగ్నిప్రమాదం, ముగ్గురు మరణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనలో నిందితుడు షారూఖ్ సైఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. షారూఖ్ సైఫీ జరిపింది ఉగ్రదాడి అని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) నిర్ధారించింది. అతడిపై యూఏపీఏ(ఉపా చట్టం)ప్రయోగిస్తామని కేరళ డీజీపీ అనిల్ కాంత్ వెల్లడించారు. 2019 షాహీన్ బాగ్ ఆందోళన సమయంలో షారూఖ్ ఉగ్రవాదం వైపు మళ్లినట్లు విచారణలో తేలింది. గతేడాది నుంచి ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోలను చూస్తున్నాడని మహరాష్ట్ర ఏటీఎస్ వెల్లడించింది. ఇదిలా ఉంటే నిందితుడికి కోజికోడ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, వైద్య పరీక్షలు పూర్తయ్యాకే ప్రశ్నిస్తామని అన్నారు. కేరళ రైలులో అటాక్ కేవలం ట్రయిలర్ మాత్రమే అని ఏటీఎస్ విచారణలో షారూఖ్ వెల్లడించినట్లు సమాచారం. గతేడాది నుంచి అతని ప్రవర్తన పూర్తిగా మారినట్లు ఏటీఎస్ విచారణలో తేలింది. నమాజ్ లోనే ఎక్కువ సమయం గడిపేవాడని, స్మోకింగ్ మానేసినట్లు తేలింది. అతడిలో మతపరమైన మార్పును గమనించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉత్తరాదికి చెందిన షారూఖ్ కేరళ ఎందుకు వెళ్లాడనే దానిపై విచారించనున్నారు.
అమరావతి పేరుతో విజయవాడను మోసం చేశారు
ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నుండి జగన్ననే మా భవిష్యత్తు కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా ప్రారంభమవుతుంది..ఏడు లక్షల మంది పార్టీ సైనికులు 1.65 లక్షల మందిని కలిసి ప్రజాసేకరణ చేయనున్నారు..గతంలో ఏ పార్టీ ఈ విధముగా చేయలేదు .. ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం చేపట్టి లబ్దిదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నాం..జగన్ననే మా భవిష్యత్తు లో ప్రజల నుండి గత ప్రభుత్వ పాలనా ఇప్పుడు మా పాలన కు సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకునే కార్యక్రమం..ఐదు అంశాలపై ప్రజల నుండి అభిప్రాయం సేకరించి వారు ఈ ప్రభుత్వంపై విశ్వాసం చూపితే వారి ఇంటికి వారి అనుమతితో మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ ను వారి ఇంటికి అంటిస్తారు..గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ లు ఏర్పాటు చేసి ఏ విధంగా పరిపాలన అందించారో మనం చూసాం..మా ముఖ్యమంత్రి లబ్దిదారుడికి అర్హత ఉంటే చాలు వారికి నేరుగా పధకాలు అందజేయని చెప్పారు..అమరావతి పేరుతో విజయవాడ నగరాన్ని మోసం చేసారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు..2019 తర్వాత నగరంలో అభివృద్ధికి కోట్ల రుపాయలు కేటాయించి రోడ్లు, డ్రైయిన్ లు, పార్కు లు అభివృద్ధి చేశాం..గత ప్రభుత్వంలో విజయవాడ అభివృద్ధికి 450 కోట్ల రుపాయలు ఇస్తే అవి వేరే వాటికి మళ్లించి విజయవాడ ప్రజలను మోసగించారు..విజయవాడలో వరదలు వచ్చిన ఎటువంటి ముప్పు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాం అన్నారు వెల్లంపల్లి.
జింకల్ని వదలని కుక్కలు.. వికారాబాద్ లో భయం భయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. జిల్లాల వారిగా..కుక్క కాటు బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. దాదాపు 3 నెలలుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటి నుంచి బయటకెళ్లాలంటేనే భయపడుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉంటున్న వీధి శునకాలు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా దాడులకు పాల్పడుతున్నాయి. చిన్నారులు, పెద్దలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. అయితే.. ఇప్పుడు మనుషులపై దాడిచేస్తున్న వీధికుక్కలు మూగ జీవాలపై దాడిగి దిగుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి చెందింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా పెదముల్ మండలం హన్మాపూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పొలంలో కృష్ణ జింకలను కుక్కలు వెంబడించాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తిన జింక పొలంలో ఫినిషింగ్ వైర్‌కు తగిలి తీవ్రంగా గాయపడింది. లేవలేని స్థితిలో ఉన్న జింకపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి చంపాయి. కుక్కల ఎగబడి తన ప్రాణాలు తీస్తున్న పాపం జింక లేవలేని పరిస్థితిలో నిస్సహాయం ఉండిపోయింది. జింకను చంపి పీక్కుతిన్నాయి. ఈఘటన చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సచిన్ కి తనిష్క్ కానుక.. ఏంటో తెలుసా?
ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పేరుతో వజ్రాభరణాలు అందుబాటులోకి వచ్చాయి. టాటా గ్రూపునకు చెందిన తనిష్క్ జ్యూలరీ కంపెనీ.. ఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 24వ తేదీన సచిన్ 50వ పుట్టిన రోజు జరుపుకోనుండటంతో వీటిని తయారుచేయించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈ మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దానికి గుర్తుగా తనిష్క్ సంస్థ హండ్రెడ్ లిమిటెడ్ ఎడిషన్ సొలిటైర్ డైమండ్ జ్యూలరీ కలెక్షన్ ని మార్కెట్ లోకి తెచ్చింది. వీటికి.. సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండుల్కర్ అనే పేరు పెట్టింది. స్టాండప్ ఇండియా పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 40 వేల 710 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 80 శాతం నిధులను లేడీస్ కే ఇచ్చారు. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారుచేసేందుకు ఈ పథకాన్ని ఏడేళ్ల కిందట.. అంటే.. 2016 ఏప్రిల్ 5న ప్రారంభించారు. ఇందులో.. మ్యానిఫ్యాక్షరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, అగ్రికల్చర్ అనుబంధ రంగాల్లో బిజినెస్ ప్రారంభించాలనుకునేవారికి రుణాలు అందజేస్తారు. ఈ పథకాన్ని 2025 వరకు అమలుచేస్తారు.
ఈ పౌర్ణమిని పింక్ మూన్ అని ఎందుకు పిలుస్తారు?
ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని ‘‘పింక్ మూన్’’గా పిలుస్తున్నారు. అయితే చంద్రుడు పింక్ కలర్ లో కనిపించకున్నా ఎందుకు ఈ పేరుతో పిలుస్తున్నారో తెలుసా..? అయితే దీని వెనక ఓ స్టోరీ ఉంది. పింక్ మూన్ విషయానికి వస్తే గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పింక్ మూన్ దర్శనం ఇస్తుంది.వసంత కాలంలో మొదటి పౌర్ణమిని పింక్ మూన్ గా పిలుస్తారు. నిజానికి చంద్రుడు గులాబీ కలర్ లో కనిపించడు కానీ వసంతకాలంలో మొదటి పౌర్ణమిని ఈ పేరుతో వ్యవహరిస్తుంటారు. ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్ ప్రకారం.. ఈ పేరు ‘ప్లోక్స్ సుబులాట’’ను సూచిస్తుంది. ఇది ఓ రకమైన పింక్ కలర్ వైల్డ్ ఫ్లవర్. ఇది ఉత్తర అమెరికాలో వసంతకాలం ప్రారంభంలో వికసిస్తుంది. ఈ పువ్వులను క్రీపింగ్ ఫ్లోక్స్, మోస్ ఫ్లోక్స్, మోస్ పింక్ అని కూడా పిలుస్తుంటారు. 1930 నుంచి ఇలా పౌర్ణమి రోజు చంద్రుడికి పేర్లు పెట్టడం ప్రారంభం అయింది. పలు దేశాల్లో సాంప్రదాయాలను బట్టి పౌర్ణమి చంద్రుడికి పేర్లు పెడుతుంటారు. క్రిస్టియన్ క్యాలెండర్లలో ఏప్రిల్ పౌర్ణమిని సాస్చల్ మూన్ అని పిలుస్తారు. ఇది ఈస్టర్ రాకను సూచిస్తుంది. చంద్రుడిని జూడాయిజంలో పెసాచ్ లేదా పాస్ ఓవర్ మూన్ అని, బౌద్ధమతంలో బక్ పోయాగా పిలుస్తారు. హిందూమతంలో ఏప్రిల్ పౌర్ణమి చైత్రమాసంలో వస్తుంది. ఇక ఇస్లామిక్ క్యాలెండర్ లో రంజాన్ మాసంలో వస్తుంది.
రోజూ కస్టమర్స్ రివ్యూ చదువుతా.. టీమ్ కుక్
ఆపిల్ కంపెనీ CEO అయిన టిమ్ కుక్, ఆపిల్ ఉత్పత్తులకు సంబంధించిన కస్టమర్ ఇమెయిల్‌లు, మెసేజ్ లను చదవడానికి తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. ఈ మెసేజ్ లను చదివేందుకు టీమ్ కుక్ ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభిస్తానంటు ఆయన వెల్లడించారు. కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ను అర్థం చేసుకోవడంలో మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడంలో తన అంకితభావాన్ని చూపుతాడు. కస్టమర్ రివ్యూలను చదవడం పట్ల టిమ్ కుక్‌కి ఉన్న ప్రేమ, అతను వారి ఫీడ్‌బ్యాక్ నుంచి పొందిన ప్రేరణ నుంచి ఉద్భవించింది. ఉదయాన్నే సమీక్షలను చదవడం వలన Apple యొక్క సాంకేతికత మరియు ఉత్పత్తులు వినియోగదారుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తున్నాయని తెలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుందని Apple CEO వెల్లడించారు. కస్టమర్ రివ్యూ చదవడం వల్ల కంపెనీ మెరుగుదల మరియు శ్రేష్ఠత కోసం ప్రయత్నించేలా ప్రేరేపిస్తుంది అని టిమ్ కుక్ అన్నారు.
కేదార్ నాథ్ వెళ్ళేవారికి శుభవార్త
కేదార్‌నాథ్ యాత్ర కోసం హెలికాప్టర్ బుకింగ్ సేవ ఏప్రిల్ 8వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. IRCTC ద్వారా భక్తులు కేదార్‌నాథ్ యాత్రకు హెలికాప్టర్‌ను బుక్ చేసుకోవచ్చు. IRCTC కేదార్‌నాథ్ వెళ్లే యాత్రికులకు హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పించడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం కేదార్‌నాథ్ యాత్ర ఏప్రిల్ 25న మొదలవుతుంది.heliyatra.irctc.co.in లింక్ ద్వారా భక్తులు కేదార్‌నాథ్ ధామ్ కోసం హెలికాప్టర్ సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. కేదార్‌నాథ్ హెలీ సర్వీస్‌ను బుక్ చేసుకునే ముందు ప్రయాణికుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మీరు చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా మీరు పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు కేదార్‌నాథ్ కోసం హెలికాప్టర్ సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసుకోకుంటే హెలీ సర్వీస్ కోసం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోలేరు.మీరు కేదార్‌నాథ్ కోసం ఆన్‌లైన్‌లో హెలికాప్టర్‌ను బుక్ చేస్తుంటే.. ఒక వ్యక్తి తన IDతో గరిష్టంగా ఆరు సీట్లను మాత్రమే బుక్ చేయగలరు. మీరు కుటుంబం లేదా సమూహంతో ప్రయాణిస్తున్నట్లయితే ఒకేసారి 12 సీట్లను మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మీరు కేదార్‌నాథ్ యాత్ర కోసం హెలీ సర్వీస్‌ను బుక్ చేసి, హెలికాప్టర్‌లో ఎక్కడాని కంటే ముందు QR కోడ్‌ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. QR కోడ్‌ని స్కాన్ చేయకుండా హెలికాప్టర్లోకి ఎక్కలేరు. టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి, వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయడానికి ఈ QR కోడ్‌ని స్కాన్ తీసుకువచ్చారు.