నేను వెంకటరమణకే ఓటేశా.. అవన్నీ తప్పుడు ఆరోపణలే
ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. నేను పార్టీ చెప్పిన ప్రకారం జయమంగళ వెంకట రమణకే ఓటు వేశాను ఆయన గెలిచారు…నన్ను ఎవరూ అనటానికి లేదు. నేను పార్టీకి చేసిన ఓటు వేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వచ్చాను. ఎమ్మెల్యే పదవినే తృణప్రాయంగా వదిలి వచ్చిన వాడిని. టికెట్ ఇస్తే పోటీ చేస్తా…లేదంటే లేదు. నియోజకవర్గంలో నేను ఏంటో చూపిస్తాను. జగన్ కూడా టికెట్ విషయంలో నాకు సానుకూలంగా లేరు అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఎవరో నా మీద తప్పుడు సమాచారం ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఇదంతా మా పార్టీ నేతలే చేస్తున్నారు అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరుకు వెళ్ళినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధకే ఓటేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మరి టీడీపీ అభ్యర్థికి ఓటేసింది ఎవరనేది తేలాల్చి ఉంది. వైసీపీ నేతలు మాత్రం పార్టీకి ద్రోహం చేసినవారి భరతం పడతామంటున్నారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ కామెంట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వల్లభనేని మాట్లాడుతూ.. మా మాజీ బాస్ డబ్బులు చూపి కొనుగోలు చేయడంలో ఎక్స్ పర్ట్..డబ్బులు ఎర చూపి నలుగురిని కొనుగోలు చేసినట్లు తెలిసింది..అందువలనే టిడిపి గెలిచింది.. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు రావనే చంద్రబాబుతో బేరం కుదుర్చుకున్నారు..దీంతో ఇద్దరికి మేలు జరిగింది.. చంద్రబాబు కు ఓటు వచ్చింది, వీరికి క్యాష్ వచ్చింది. మొన్న తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని టిడిపి అంది ఇప్పుడు ఎపిలో 175 గెలుస్తామని చెబుతుంది, జరిగేవి చెప్పాలన్నారు వంశీ.
నంద్యాల జిల్లాలో దొంగల బీభత్సం
నంద్యాల జిల్లాలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నంద్యాల జిల్లా డోన్ లో దొంగల బీభత్సం సృష్టించారు. కూరగాయల మార్కెట్ లో మూడు షాపులు టార్గెట్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద రెండు షాపుల్లో చోరీలు జరిగాయి. సుకులమ్మ ఆలయంలో చోరీ ఘటన మరువకముందే మరో చోరీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. వరుస చోరీలతో భయాందోళనకు గురవుతున్నారు పట్టణ వాసులు.వరుస చోరీలతో రెచ్చిపోతున్నారు. మొన్నటి సుకులమ్మ ఆలయంలో చోరీ ఘటన మరువక ముందే.. డోన్ కూరగాయాల మార్కెట్, మున్సిపల్ కార్యాలయం వద్దున్న పలు కిరణా దుకాణాలను దోచేశారు. అర్థరాత్రితాళాలు పగులగొట్టిన చోరీకి పాల్పడ్డట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల నిఘా వైఫల్యం వల్లే వరుస చోరీలు జరగుతున్నాయంటున్నారు. పెట్రోల్ వాహనాలను పెంచి దొంగల భయం నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.
మళ్ళీ అదే సీన్… ఈసారి రెడ్ లైన్ నిబంధనతో సస్పెన్షన్
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్ల ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటినుంచి టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీలో అమల్లోకి వచ్చింది రెడ్ లైన్ నిబంధన. స్పీకర్ పోడియం చుట్టూ రెడ్ లైన్ ఏర్సాటు చేశారు. గీత దాటి పోడియంలోకి జొరబడే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ అవుతారు. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రెడ్ లైన్ ఇవతల నిలబడి నినాదాలు చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇలాగే కొనసాగింది. సభ ప్రారంభం కాగానే తాము ఇచ్చిన వాయిదా తీర్మానం పై చర్చ కు పట్టుబట్టారు టీడీపీ సభ్యులు. జీవో నెంబర్ 1 పై వాయిదా తీర్మానం పై చర్చకు పట్టుబట్టారు టీడీపీ సభ్యులు.
శాసనమండలిలో మారనున్న బలాబలాలు
ఏపీ శాసనమండలి స్వరూపం మారనుంది. శాసనమండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది బీజేపీ. శాసనసభలోనూ ఆ పార్టీకి ఒక్క సీటు కూడా లభించలేదు. ఇటు శాసనమండలిలో ఇటీవలి వరకూ ఆ పార్టీ నేత పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. కనీసం ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఒక్కటి కూడా ఆపార్టీకి లేకుండా పోయింది. దీంతో చట్టసభల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రాతినిధ్యం లేదు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో అధికార వైకాపా సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి (గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వారితో కలిపి) 44కు చేరుకోనుంది..
మేకపాటి మిస్సింగ్.. ఎక్కడికెళ్ళినట్టు?
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉదయగిరి ఎం.ఎల్.ఏ. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయంలో వైసీపీ ఫ్లెక్సీలు కనిపించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన అనుచరులు కూడా అందుబాటులో లేరు. శాసనసభలో కనిపించని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపైన చర్చ సాగుతోంది. క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల గురించి లాబీల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇవాళ ఇప్పటి వరకు హాజరు కాని ఈ ఇద్దరు సభ్యులు ఎక్కడికెళ్ళారనేది వైసీపీ వర్గాలను కుదిపేస్తోంది. ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే బెంగళూరు వెళ్ళి పోయారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి. ఆయన ఎక్కడున్నారోనని తెలుసుకునేందుకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉంది.ఇటీవల ఆయన స్వల్ప అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం సీఎం జగన్ ను కలసినప్పుడు ఈసారి టిక్కెట్ ఇవ్వలేనని, ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ చెప్పడంతోనే ఆయన క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతున్నారు.
బైక్ ఒకరిది.. ట్రాఫిక్ చలానా మరొకరికి
ట్రాఫిక్ నిబంధలు ఉల్లఘించిన వారిపై పోలీసులు చాలాన్ విధిస్తూ.. ట్రాఫిక్ నిబంధలపై సూచనలిస్తుంటారు. అయినా కొందరు కేటుగాల్లు మాత్రం వారిపని వాళ్లు చేసుకుపోతూ ట్రాఫిక్ చలాన్ల బారిన పడుతుంటారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి ట్రాఫిక్ చలాన్ వస్తే దానికంటూ ఓ అర్థం ఉంటుంది కానీ ఇక్కడ తప్పు చేసింది ఒకరైతే చలానా మరొకరిపై పడింది. అదేంటి అంటారా.. బైక్‌లు రెండు రిజిస్ట్రేషన్ నెంబర్లు మాత్రం ఒకటే అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా. ఎస్ మీరు వినేది నిజమే.. రెండు బైక్‌లకు ఒకటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండటంతో ఒకరు చేసిన తప్పుకు మరొకరు బాధ్యత వహించాల్సి వచ్చింది. అంటే.. ఒకరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మరొకరు అపరాధ రుసుం చెల్లించాల్సిన పరిస్థితి రావడం అన్నమాట. ఇలాంటి ఘటన ఎక్కడో కాదండోయ్ కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణానికి చెందిన తుమ్మలపూడి పెద్దపుల్లారావుకు హీరో స్పెండరు ఐస్మార్టు బైక్ ఉంది. దాని రిజిస్ట్రేషన్ నెంబరు టీఎస్ 04 ఇసి 8571. సత్తుపల్లిలోని కాకర్లపల్లి రోడ్డులో రాంగ్ పార్కింగు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు ఇటీవల రూ .235 విధిస్తూ ఈ చలాన విధించారు. చలానలో వచ్చిన చిత్రం చూసి పెద్ద పుల్లారావు విస్తుబోయారు. అది పుల్లారావు హీరోహోండా స్పెండర్ ఇస్మార్ట్ బైక్ కాదు.
వామ్మో వీడి ధైర్యం తగలెయ్యా.. మొసలినే మోసుకెళ్తున్నాడు
మొసళ్లు చాల ప్రమాదకరమైనవి. వాటిని చూస్తేనే చాలామంది భయపడతారు. మరికొంతమంది వాటిని చూసేందుకు కూడా ఇష్టపడరు. మొసళ్లు ఉభయచర జీవులు. నేల మీద నీటిలోపల జీవించగలవు. అవి దాడి చేస్తే మామూలుగా ఉండదు. ఈ మొసళ్ళు వాటికి ఆకలేస్తే అకస్మాత్తుగా దాడి చేస్తాయి. అవి ఎటాక్ చేశాయంటే వాటి గురి తప్పదు. అలాంటి మొసలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు మొసలిని తన వీపుపై మోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసిన వాళ్లు షాక్ తింటున్నారు. ఒక చిన్న పిల్లవాడు తన వీపుపై మొసలితో నిర్భయంగా వీధిలో నడుస్తున్నాడు. గత నెల ఫిబ్రవరి 16న ట్విట్టర్‌లో షేర్ చేసిన క్లిప్ ఆ తర్వాత తొలగించబడింది. బాలుడు మొసలి ముందు కాళ్లను పట్టుకుని భుజాలకు చుట్టి ఉండగా, మిగిలిన మొసలి వెనుక నుంచి వేలాడుతూ కనిపించింది. బాలుడి ఈ ధైర్యసాహసాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనను కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు కూడా చేశారు. వీడియోలో స్థలం గురించి ప్రస్తావించనప్పటికీ, వీడియో తీసిన ప్రదేశాన్ని బట్టి ఇక్కడ చేపల వేట ఎక్కువగా జరుగుతున్నట్లు సూచిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందించారు. “మొసలి అలసిపోయింది” అని ఒక నెటిజన్ రాశారు. “మొసలికి మంచి స్నేహితుడు దొరికాడు” అని మరొకరు చెప్పారు.
చిత్రపరిశ్రమలో విషాదం.. టాలెంటెడ్ డైరెక్టర్ మృతి
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, ఎడిటర్ ప్రదీప్ సర్కార్ మరణించాడు. 67 ఏళ్ల వయసులో ముంబై లోని హాస్పిటల్ లో ‘డయాలసిస్’ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రదీప్ సర్కార్ మరణించాడు అనే వార్త బాలీవుడ్ ని కుదిపేసింది. హిందీ చిత్ర పరిశ్రమ అంతా ప్రదీప్ సర్కార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విదు వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ లో రైటర్ గా వర్క్ చేసిన ప్రదీప్ సర్కార్ మొదటిసారి మున్నాభాయ్ MBBS సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేసాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారిన ప్రదీప్ సర్కార్, 2005లో దర్శకుడిగా మరి ‘పరిణీత’ సినిమా తెరకెక్కించాడు. ఈ మూవీ మ్యూజికల్ హిట్ అయ్యింది కానీ బాక్సాఫీస్ దగ్గర సో సో గానే ఆడింది. 2005 నుంచి 2010 వరకూ ‘లగా చునేరి మే దాగ్’, ‘లఫంగే పరిందే’ సినిమాలని చేసాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దీంతో ప్రదీప్ సర్కార్ నాలుగేళ్ల గ్యాప్ తీసుకోని 2014లో ‘మర్ధాని’ సినిమా చేసాడు.
ఎన్టీఆర్ సినిమాకి జక్కన వారసుడు ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సెకండ్ ఔటింగ్ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గత మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మూవీ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో ఓపెన్ అయిన ఈ మోషన్ పోస్టర్ “వస్తున్నా” అనే డైలాగ్ తో ఎండ్ అయ్యింది. పాన్ ఇండియా రిలీజ్ అవ్వనున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ కి కూడా ఎన్టీఆర్ స్వయంగా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. దీంతో ‘ఎన్టీఆర్ 30’ సినిమా టాక్ అఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. అప్పటినుంచి నందమూరి అభిమానులు ‘ఎన్టీఆర్ 30’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మార్చ్ చివరలో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయిన ఈ మూవీ ముహూర్తం రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ మధ్య గ్రాండ్ గా జరిగింది.
మక్కాలో సానియా మీర్జా.. ఆమాటలకు అర్థం ఏంటో తెలుసా?
భారత టెన్సిస్ స్టార్ సానిమా మీర్జా ఇటీవలే ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మాజీ టెన్నిస్ ప్లేయర్ తన కుమారుడుని, ఇంటిని చూసుకోవడానికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఓ ఫోట్ వైరల్ అవుతోంది. ఆమె సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించారు. రంజాన్ పర్వదినానికి ముందు ఉమ్రా చేసేందకు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సానియా నిండుగా బురఖా ధరించి కనిపించారు. ఆమెతో పాటు కుమారుడు ఉన్నాడు. అయితే సానిమా మిర్జా భర్త, పాకిస్థాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్ మాత్రం వీరితో కనిపంచలేదు. అంతేకాదు, సానిమా తన మక్కా సందర్శనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ పోస్ట్ కు ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అల్లాహ్.. మా ప్రార్థనలను వింటాడు అని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో సానిమా మీర్జా పోస్ట్ చేసింది. ఆమె ఏం కోరుకొని ఉంటారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. భర్త సోయబ్ తో సానియాకు భేదాభిప్రాయాలు ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సానియా ఏదైనా కీలక నిర్ణయం తీసుకున్నారా అని సందేహం వ్యక్తం అవుతుంది. మొహమ్మదీయుల జీవితంలో పవిత్ర స్థలాలను సందర్శించడం ఒక ముఖ్యమైన భాగం.. సాధారణంగా వీరు మక్కాను సందర్శిస్తారు.. ఈ యాత్రను ఉమ్రా ఉంటారు. అయితే రంజాన్ మాసంలో మక్కాకు వెళ్లడాన్ని హజ్ యాత్ర అని పిలుస్తారు. సాధారణ రోజుల్లో ఈ యాత్రకు వెళితే దాన్ని ఉమ్రా అని పిలుస్తారు. మక్కా సందర్శించి, దాన ధర్మాలు చేస్తే శుభం కలుగుతుందని వీరు నమ్ముతారు.