సోషల్ మీడియా వచ్చాక కొత్తగా పుట్టుకొచ్చిన మరో పదం ‘మీమ్స్’! ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ, నాటకీయ పరిణామాలకీ… ఏదో ఒక సినిమాలోని ఎప్పటి డైలాగ్ నో, సీన్నో కనెక్ట్ చేస్తూ హాస్యం, వ్యంగ్యం సృష్టించటం ‘మీమ్స్’ ప్రత్యేకత! ఓ పెద్ద వ్యాసం కూడా చెప్పలేని విషయాన్ని ఒక్కోసారి ‘మీమ్స్’ క్షణ కాలంలో మనసులోకి చొచ్చుకుపోయేలా చెప్పేస్తుంటాయి…
మీమ్స్ క్రియేటర్స్ కు లెటెస్ట్ గా ఫుట్ బాలర్ క్రిస్టినో రొనాల్డో, బాలీవుడ్ బ్యూటీ అమృతా రావ్ ఫేవరెట్స్ అయ్యారు. రొనాల్లో ‘యూరో 2020’ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రెండు కోకా కోలా బాటిల్స్ తన ముందు టేబుల్ పై ఉంటే వాట్ని తీసేయించాడు. వాటర్ బాటిల్స్ అక్కడ ఉంచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఛాంపియన్ చేసిన పనికి కోకా కోలా కంపెనీకి 4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందట!
రొనాల్డోకి, కోకా కోలాకి మధ్యలో గొడవలో అమృతా రావ్ కి ఏం పని అంటారా? ఆమె 2006లో ‘వివాహ్’ అనే సినిమా చేసింది. అందులో ‘జల్ లీజియే’ అనే డైలాగ్ ఉంటుంది. అందుకే, ఆ సినిమాలోని అమృతా పిక్స్ వాడుతూ రొనాల్డో బొమ్మలు పక్కన జత చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్స్! అవి ఎంత ఫన్నీగా ఉన్నాయంటే… స్వయంగా అమృతా రావ్ కూడా తన అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో షేర్ కొన్నిట్ని షేర్ చేసింది!