‘నకిలీ, డా. సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తాజాగా విజయ్ ఆంటోని హీరోగా ‘విజయ రాఘవన్’ చిత్రం రూపొందించారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి. డి. రాజా, డి. ఆర్. సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Also: ఆ ఏడు సినిమాల పరిస్థితి ఏమిటీ!?
అతి త్వరలో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను సోమవారం రానా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన, ప్రస్తుతం రాజకీయ పార్టీలు అవలంభిస్తున్న తీరుపై సెటైరికల్ గా ‘విజయ రాఘవన్’ చిత్రం రూపుదిద్దుకుందనే విషయం ఈ ట్రైలర్ ను చూస్తే అర్థమౌతోంది. ఓ సాధారణ టీచర్ రాజకీయ నేతగా మారి, పొలిటికల్ సిస్టమ్ లో ఎలాంటి మార్పు తెచ్చాడనే అంశాన్ని దర్శకుడు ఆనంద్ కృష్ణన్ ఇందులో డీల్ చేసినట్టు అనిపిస్తోంది.
Read Also: ఆహా అనిపించేలా ఆహారం! శర్వానంద్ కు ‘ఆడవాళ్ల జోహార్లు’!
ఈ సినిమా గురించి విజయ్ ఆంటోని మాట్లాడుతూ, ”ఓ మాస్ ఏరియాలో పిల్లలు పక్క దారులు పట్టకుండా… చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, వారి ఉన్నతికి పాటు పడే యువకుడి కథే ‘విజయ రాఘవన్’. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా దీనిని దర్శకుడు ఆనంద్ కృష్ణన్ తెరకెక్కించారు. నాది డిఫరెంట్ పాత్ర. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు. ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు మ్యూజిక్ నివాస్ కె. ప్రసన్న అందించారు.