సమంత రాజి పాత్ర ఎందుకు చేసిందంటే….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత నటించిన తొలి వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. విశేషం ఏమంటే… ఆ సీరిస్ కు సమంతే హైలైట్. ఆమె పోషించిన రాజి పాత్రకు వస్తున్న అప్లాజ్ ఇంతా అంతా కాదు. ఇదే విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. తమిళ ఈలం కు చెందిన ఉద్యమకారిణి పాత్ర తాను చేయడానికి గల కారణాలనూ సమంత వివరించింది. రాజ్ అండ్ డీకే ఈ పాత్ర ను గురించి తనకు చెప్పిన రోజులను సమంత గుర్తు చేసుకుంది. మరీముఖ్యంగా పలు వివాదాల నడుమ విడుదలైన ఈ వెబ్ సీరిస్ గురించి వచ్చిన సమీక్షల పట్ల సమంత హర్షాన్ని వ్యక్తం చేసింది. రాజ్, డీకే తనను అప్రోచ్ అయినప్పుడు రాజి పత్ర్యేకపాత్ర అని, దానిని చాలా నెన్సిటివ్ గా, బాలెన్స్డ్ గా చేయాలని తాను గ్రహించానని తెలిపింది. అందులో భాగంగా క్రియేటివ్ టీమ్ కొన్ని డాక్యుమెంటరీస్, మరీముఖ్యంగా ఈలం పోరులో మహిళలు పడిన అగచాట్లకు సంబంధించిన వీడియోలు చూపించినప్పుడు తానెంతో కలత చెందానని, షాక్ కు గురయ్యానని సమంత చెప్పింది. అదే సమయంలో లక్షలాది మంది ప్రాణ త్యాగం చేసిన ఈ పోరాటానికి సంబంధించిన వీడియోలను కేవలం వేలమంది మాత్రమే చూడటం తాను గమనించానని తెలిపింది. మాతృదేశంలోనే ప్రాణాలను కోల్పోయిన వారు కొందరు కాగా, శరీరక, మానసిక గాయాలతో పరాయి ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్లు కొందరని చెప్పింది సమంత. తనవరకూ రాజీ పాత్ర ఓ ఊహాజనితమైనదే అయినా అసమాన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, బాధాకరమైన జ్ఞాపకాలతో ఇప్పటికీ జీవచ్ఛవాల్లా బతుకుతున్న వారికి ఇదో నివాళిగా తాను భావించానని సమంత చెప్పింది. రాజీ కథను తెరపై చూసిన వారు ద్వేషం, అసమానత, దురాశలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మద్దత్తు నిస్తారనే ఆశాభావాన్ని సమంత వ్యక్తం చేసింది. ఒక వేళ మనం ఆ పనిచేయలేకపోతే… ఎంతో మంది తమ గుర్తింపును, స్వేచ్ఛను, స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది అని సమంత తెలిపింది. మొత్తం మీద తన ముందుకొచ్చిన ఓ పాత్రను నటిగా అంగీకరించడమే కాకుండా లోతుపాతులను తెలుసుకుని, ఆ పాత్రకోసం ప్రాణం పెట్టిన సమంతను అభినందించాల్సిందే అంటున్నారు నెటిజన్లు.
Also Read
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!