చెర్రీ, శంకర్ మూవీ సెట్స్ పైకి 2022లోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా కష్టాలు అంటే ఏమిటో సినిమా వాళ్లకే బాగా అనుభవంలోకి వస్తాయి. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ అదే పరిస్థితిలో ఉన్నారు. పైకి గంభీరంగా ఆయన కనిపిస్తున్నా, లోలోపల ఏ సినిమా ఎప్పుడు ఎలా పూర్తి చేయాలో తెలియక సతమతమౌతున్నారని తెలుస్తోంది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్… నిజంగా ఇన్ని వివాదాల్లో ఒకేసారి కూరుకుపోతారని కోలీవుడ్ లో ఎవరూ ఊహించలేదట. ఆయన దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారు, అలానే కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు నిర్మించడానికి ప్రొడ్యూసర్స్ సైతం సై అంటున్నారు. కానీ కాలం కలిసి రాకపోవడం వల్ల శంకర్ ఇబ్బందులు పడుతున్నట్టు అనిపిస్తోంది. రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు ఈ యేడాది ద్వితీయార్థంలో కొత్త సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంది. ఆ క్రేజీ, భారీ మూవీకి రూ. 150 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనాలు వేశారు. కానీ ఇండియన్ -2 నిర్మాతలతో వైరం ఓ కొలిక్కి వచ్చే వరకూ చెర్రీ మూవీ సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ కనిపించడం లేదు.
ఇప్పటికే యాభై శాతం పూర్తి అయిన ఇండియన్ 2ను పూర్తి చేసి కానీ శంకర్ మరో సినిమా చేయడానికి వీలు లేకుండా ఆయన చేతులకు బంధం వేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. పైగా దీనితో పాటు హిందీలోనూ రణవీర్ సింగ్ తో ఓ మూవీ చేయడానికి శంకర్ అంగీకరించాడు. ఒకవేళ కమల్ హాసన్ఇండియన్ 2ను పూర్తి చేసి కానీ రామ్ చరణ్ ప్రాజెక్ట్ కు శంకర్ రాకపోతే… అప్పటి వరకూ చెర్రీ ఖాళీగా ఉండగలడా? అనే సందేహం ఒకటి ఉంది. మరి కమల్, చెర్రీల సినిమాలు పూర్తి చేసే వరకూ అక్కడ రణవీర్ సింగ్ ఆగుతాడా అనే మరో ప్రశ్నా ఉదయిస్తోంది. ఏది ఏమైనా ఈ యేడాది ద్వితీయార్థంలో మాత్రం చెర్రీ – శంకర్ మూవీ సెట్స్ పైకి వెళ్ళడదని సినీజనం భావిస్తున్నారు. వచ్చే యేడాది మాత్రమే దీని రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట. మరి ఈ లోగా ఏదైనా మిరకిల్ జరిగి, ఇండియన్ 2 నిర్మాతలను శంకర్ ఒప్పించడగలిగితే… మంచిదే!!
Also Read
తాజావార్తలు
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?