భాషలకతీతంగా హాట్ బ్యూటీస్ తమ అందాలతో ఆడియన్స్ ని అలరించటం కొత్తేం కాదు. ముంబై బ్యూటీ ఊర్వశీ రౌతేలా మొదలు కన్నడ సుందరి శ్రీనిధి శెట్టి వరకూ ఇప్పుడు చాలా మంది అందగత్తెలు తమిళ పరిశ్రమపై కన్నేశారు. త్వరలోనే ఈ నాన్ తమిళ్ నారీమణులు చెన్నైలో హల్ చల్ చేయనున్నారు. లెట్స్ హ్యావ్ ఏ లుక్…
2015లో విశ్వ సుందరి కిరీటం నెత్తిన పెట్టుకుంది ఊర్వశీ రౌతేలా. అయితే, మోడల్ గా సూపర్ ఫేమ్ సంపాదించుకున్న ఈ అప్సరస హీరోయిన్ గా మాత్రం రేసులోకి రాలేకపోయింది. ‘పాగల్ పంతి, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4’ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ నటిగా పెద్దగా సంచలనం సృష్టించలేకపోయింది. అయితే, బోలెడంత గ్లామర్ సంపదలున్న ఊర్వశీ ఇప్పుడు తమిళ జనంపై దృష్టి పెట్టింది. వార్ని అలరించేందుకు హీరో శరవణన్ సరసన ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తోంది. డెబ్యూ మూవీలో ఆమె క్యారెక్టర్ మైక్రో బయాలజిస్ట్ అంటున్నారు.
‘కేజీఎఫ్’తో దేశం దృష్టిని ఆకర్షించిన బెంగుళూరు భామ శ్రీనిధి కూడా కోలీవుడ్ జర్నీకి శ్రీకారం చుట్టబోతోంది. ఏకంగా చియాన్ విక్రమ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ‘కోబ్రా’ సినిమాలో ఈ కోమలి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా నటిస్తుండటం, మరో విశేషం!
బై బర్త్ చెన్నై పొన్ను అయినా కూడా… ముందుగా కన్నడ సినిమా చేసింది ప్రియాంక అరుల్ మోహన్. తరువాత నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు తమిళంలోనూ అలరించబోతోంది. శివకార్తికేయన్ ‘డాక్టర్’ సినిమాతో ప్రియాంక కోలీవుడ్ గ్లామర్ రేసులోకి రానుంది.
హీరో సుమంత్ ‘మళ్లీ రావా’, నాగార్జున ‘దేవదాస్’ చిత్రాల్లో నటించిన ముంబై బ్యూటీ ఆకాంక్ష సింగ్ కూడా చెన్నై బాట పట్టింది. దర్శకుడు పృథ్వీ ఆదిత్య రూపొందిస్తోన్న ‘క్లాప్’ చిత్రంలో ఈమె హాకీ ప్లేయర్ గా డిఫరెంట్ రోల్ లో కనిపించబోతోంది. హీరో ఆది పినిశెట్టితో రొమాన్స్ చేయనుంది.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్… తెలుగులో ‘గూఢచారి’ సినిమాతో గుర్తింపు పొందిన శోభితా ధూళిపాలా సైతం తమిళ ఇండస్ట్రీలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. నన్ అదర్ ద్యాన్ మణిరత్నం తలపెట్టిన… యాంబీషియస్ మల్టీ స్టారర్… ‘పొన్నియన్ సెల్వన్’లో ఆమె రోల్ సంపాదించింది. శోభితా క్యారెక్టర్ గురించిన వివరాలు ఇంకా పెద్దగా బయటకు రాలేదుగానీ… ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో తమిళ తెరపైకి వెళుతుండటం… బిగ్ అచీవ్మెంటే!