రేస్2విన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా డెమోక్రటిక్ సంఘ అసోసియేషన్ ఛేంజ్ మేకర్ అవార్డులను అందించింది. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా సమాజంలో మార్పు కోసం పాటుపడిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి వారికి ఈ అవార్డులు అందజేసింది. ఛేంజ్ మేకర్ అవార్డులతో ఏటా డెమోక్రటిక్ సంఘ సత్కరిస్తుంది. ఈ ఏడాది కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పార్లమెంటు సభ్యురాలు జి.రేణుకాచౌదరి హాజరయ్యారు. గౌరవ అతిథిగా మిస్ యూనివర్స్-1994 సుస్మితా సేన్, హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ కూడా ఇందులో పాలు పంచుకున్నారు. నటి, సామాజిక కార్యకర్త భూమి ఫడ్నేకర్ ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
Allu Arjun: ఇది ఒక యాక్సిడెంట్, ఎవరి తప్పులేదు!
స్వామి అగ్నివేష్ అడుగు జాడల్లో నడుస్తూ సామాజిక న్యాయం, సమానత్వం మరియు మానవ హక్కుల కోసం పాటుపడే వ్యక్తులు, సంస్థలను డెమోక్రటిక్ సంఘ గుర్తిస్తుంది. అలాంటి వారికి చేంజ్ మేకర్ అవార్డులను అందజేస్తుంది. కాగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, పేదరికం, అట్టడుగున ఉన్న పలు సమస్యలను పరిష్కరించడం వంటి పలు అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు ఈ అవార్డుల కార్యక్రమం ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది.