హృతిక్ రోషన్ అగ్నిపథ్ ప్రత్యేకత ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిట్టు కొట్టినోడు ఇరగదీస్తాడు అని సినిమా సామెత. పదేళ్ల క్రితం రిపబ్లిక్ డే రోజున విడుదలైన హృతిక్ రోషన్ మూవీ అగ్నిపథ్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దాంతో అభిమానులు ఆ సంబరాన్ని తలచుకుంటూ హృతిక్ సోషల్ మీడియాలో అభినందనలతో సందడిచేశారు. అదేమన్నా సూపర్ డూపర్ హిట్టా అంటే అందేమీ కాదు. నిర్మాతకు మంచి లాభాలు చూపించిన చిత్రమే. బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసినదే. సినీ ట్రేడ్ పండిట్స్ సూపర్ హిట్ అని కితాబు కూడా ఇచ్చారు. అంతకు మించి ఏమీలేదు. మరెందుకింత హంగామా? అక్కడే ఉంది అసలు కథ! ఈ సినిమా 1990లో అమితాబ్ బచ్చన్ హీరోగా ముకుల్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన అగ్నిపథ్‌కు రీమేక్ కావడం ఇక్కడ విశేషం! 1990 నాటి అగ్నిపథ్‌ను నిర్మించిన యశ్ జోహార్ తనయుడు కరణ్ జోహార్ 2012 నాటి అగ్నిపథ్‌ను నిర్మించడం మరో విశేషం! ఈ సినిమా ద్వారా కరణ్ జోహార్ వద్ద అసోసియేట్ గా పనిచేసిన కరణ్ మల్హోత్రా దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ అగ్నిపథ్‌ను తమ తండ్రికి నివాళిగానూ కరణ్ జోహార్ ప్రకటించారు.
అమితాబ్ బచ్చన్ వంటి మేటి నటుడు, నాటి సూపర్ స్టార్ తో యశ్ జోహార్ అగ్నిపథ్ తీసి చేతులు కాల్చుకున్నారు. నిజానికి అమితాబ్ అగ్నిపథ్ తక్కువేమీ పోగేయలేదు. ఆ రోజుల్లో ఆ వసూళ్ళు అదిరిపోయేవే వచ్చాయి. కానీ, సినిమా పెట్టుబడికి, రాబడికి పోల్చిచూస్తే నష్టమొచ్చిన చిత్రంగానే పరిగణించాల్సి వచ్చింది. అమితాబ్ బచ్చన్ కు ఆ అగ్నిపథ్ ద్వారా ఉత్తమనటునిగా నేషనల్ అవార్డు లభించింది. అంతకు మించి అదేమీ సాధించలేదు. ఆ అవార్డు విషయంలోనూ పలు విమర్శలు వినిపించాయి. అమితాబ్ బచ్చన్ అంతకు ముందే అంతకంటే గొప్పగా నటించిన చిత్రాలు ఉన్నాయని, నిజానికి వాటితో పోలిస్తే అగ్నిపథ్‌లో ఆయన నటన చెత్తగా ఉందనీ విమర్శించారు. ఇక హృతిక్ రోషన్ తో కరణ్ జోహార్ అగ్నిపథ్ ఆరంభించినప్పుడూ పలు విమర్శలు వినిపించాయి. అమితాబ్ బచ్చన్ సినిమానే సరిగా ఆడలేదు. దానికి మళ్ళీ రీమేక్ ఒకటా అన్నారు. హృతిక్ హీరోగా న్యాయం చేయలేడనీ వాదించారు. ఇలాంటి విమర్శల నడుమే కరణ్ జోహార్ అగ్నిపథ్‌ను రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. మరి అలాంటప్పుడు అగ్నిపథ్‌ను గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది కదా! అందుకే అగ్నిపథ్ పదేళ్ళు పూర్తయిన సందర్భాన్ని అటు హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఇటు అభిమానులు గుర్తు చేసుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!