హిట్టు కొట్టినోడు ఇరగదీస్తాడు అని సినిమా సామెత. పదేళ్ల క్రితం రిపబ్లిక్ డే రోజున విడుదలైన హృతిక్ రోషన్ మూవీ అగ్నిపథ్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దాంతో అభిమానులు ఆ సంబరాన్ని తలచుకుంటూ హృతిక్ సోషల్ మీడియాలో అభినందనలతో సందడిచేశారు. అదేమన్నా సూపర్ డూపర్ హిట్టా అంటే అందేమీ కాదు. నిర్మాతకు మంచి లాభాలు చూపించిన చిత్రమే. బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసినదే. సినీ ట్రేడ్ పండిట్స్ సూపర్ హిట్ అని కితాబు కూడా ఇచ్చారు.…