CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాయలసీమ చరిత్రలో 2026 అక్టోబర్ 2వ తేదీ చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. కరువు సీమలో రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో కరువు సీమ కాస్తా సిరుల సీమగా మారుతుందని పేర్కొన్నారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు కలిపి సుమారు రూ.లక్ష కోట్ల సమీకరణకు ప్రణాళిక రూపొందించినట్లు అధికారిక వివరాలు చెబుతున్నాయి. అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. కరువు నేలను గ్లోబల్ ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అదనంగా 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగును విస్తరించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. రాయలసీమలో మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఇతర పండ్లు, కూరగాయలు, పూల సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. సాగునీరు అందిస్తే సీమ రైతులు బంగారం పండిస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు అన్నారు. రాయలసీమ రైతులకు అనేక రకాల పంటలు పండించే సత్తా ఉందని, పండ్లు, కూరగాయలు, పూలు పండించే ప్రత్యేక సామర్థ్యం ఈ ప్రాంతానికి ఉందని పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగుతో పాటు ప్రాసెసింగ్, కోల్డ్‌చైన్, మార్కెటింగ్, ఎగుమతులను అనుసంధానం చేసి రైతులకు మరిన్ని ఆదాయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి సాగునీరు కీలకమని సీఎం స్పష్టం చేశారు. రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేసి మూడేళ్లలో జాతికి అంకితం చేస్తామని తెలిపారు. చాలామంది తనను ‘వాటర్ మ్యాన్’ అని పిలుస్తారని, తప్పకుండా రాయలసీమను కరువు సీమ కాదని నిరూపిస్తానని అన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రణాళికలో సాగునీటికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు కొత్త ఆయకట్టు కల్పన, ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణ, సూక్ష్మ సాగునీటి విధానాల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని వైసీపీ అడ్డుకుందని చంద్రబాబు ఆరోపించారు. పట్టిసీమ లేకపోతే రాయలసీమ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలని అన్నారు. నీటిని సీమకు తీసుకురావడంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, కేంద్రం సహకారంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పోలవరం పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు. కేంద్రం సహకారంతో రాయలసీమను గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీని ఉద్దేశించి ఇక నుంచి ఆయనను ‘తెలుగు బిడ్డ’, ‘మనందరి ముద్దుబిడ్డ’గా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌తో రైతులు, గ్రామీణ ప్రాంతాలు, పెట్టుబడులు, ప్రాసెసింగ్, ఎగుమతులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. రాయలసీమను కేవలం కరువు ప్రాంతంగా కాకుండా దేశానికి ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా, ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానమైన ‘ఫ్రూట్ బౌల్’గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సాగునీరు, ఉద్యాన పంటలు, రహదారులు, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను సమగ్రంగా అభివృద్ధి చేసి సీమ రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?