వేల కోట్లలోనే బాలీవుడ్ కు నష్టం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత యేడాది కంటే ఈ సంవత్సరం కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో వేలాది మంది థియేటర్ల యాజమాన్యం సొంత నిర్ణయంతోనే వాటిని మూసేశారు. సినిమా షూటింగ్స్ దాదాపు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. విడుదల అనే మాట కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితంతో పోల్చితే ఈ సారి లాభాల్లో భారీ కోత పడే ఛాయలు కనిపిస్తున్నాయి. 2020 తొలి త్రైమాసికంలో బాలీవుడ్ చిత్రసీమ వసూళ్ళు 1150 కోట్ల రూపాయలు ఉండగా, గత యేడాదిలో అది కేవలం 50 కోట్లకు పడిపోయింది.
ఈ యేడాది రాబడి సంగతి పక్కన పెడితే ఇంత వరకూ వచ్చిన నష్టమే నాలుగు వేల కోట్లుగా ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. సినిమాల షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు, ముందు అనుకున్న తేదీకి సినిమాలు రిలీజ్ జరగకపోవడంతో సంభవించిన నష్టం ఇదట! గత యేడాది థియేటర్స్ ను ప్రభుత్వాలే నిలిపివేస్తే, ఈసారి మాత్రం కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జనాలు థియేటర్లకు వల్లడం బంద్ చేశారు. దాంతో అతి సహజంగా వాటిని క్లోజ్ చేయాల్సి వచ్చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్ల యాజమాన్యం మరోసారి ఈ వ్యాపారానికి తిలోదకాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మే లో కరోనా పీక్స్ కు చేరుకుని జూన్ నుండి కాస్తంత నిదానించవచ్చునని అంటున్నారు. అదే జరిగితే.. ద్వితీయార్థంలో ప్రథమార్ధం అంత నష్టం కలుగకపోవచ్చు. ఏదేమైనా సల్మాన్ ఖాన్ రాథే చిత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఇటు ఓటీటీ అటు థియేటర్లలో సైమల్టేనియస్ గా మూవీస్ ను విడుదల చేయాలని అనుకున్న నిర్మాతలను డైలమాలో పడేసినట్టు అయ్యిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!