Hyderabad: గంజాయి మత్తు.. యువకుల వీరంగం.. పోలీసు వాహనం ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలోని మెహదీపట్నంలో యువకులు వీరంగం సృష్టించారు. సోమవారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు ఆసిఫ్‌నగర్‌లో హల్‌చల్ చేశారు. పోలీసు వాహనం పైకి ఎక్కి ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలపై దాడిచేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్‌చల్ చేశారు. జిర్రా సమీపంలోని రాయల్స్ హోటల్ వద్ద గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆదే సమయంలో ముఠా సభ్యులు పోలీసు వాహనమెక్కి బీభత్సం సృష్టించారు. మత్తులో ఉన్న యువకులు పోలీస్ వాహనంపైకి ఎక్కి నానా హంగామా చేశారు. పోలీసు వాహనంతో పాటు ఇతర వాహనాల అద్దాలు పగలగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా..అజయ్ అనే యవకుడిని అసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది. గంజాయి మత్తులో యువకులు రోడ్లపై హంగామా సృష్టించారు. అర్ధరాత్రి వాహనదారులను అడ్డుకుని వాదనకు దిగారు. ఇటీవలే చొప్పదండి పట్టణంతో పాటు వివిధ గ్రామాలు సమీప మండలాలైన రామడుగు, గంగాధర మండలాల్లో గంజాయి విక్రేతలను పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల నిఘాకు అందకుండా మరికొందరు గంజాయి విక్రేతలు సోషల్ మీడియా సందేశాలతో యువకులకు సరఫరా చేస్తున్నారనే స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి లభించని యువకులు కొందరు బొనొఫిక్స్ ద్రావకాన్ని తయారు చేసుకుని సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు.
Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!