Governor Tamilisai: యాదాద్రి నరసింహ స్వామి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు నాలుగో రోజు ఉదయం వత్రశాయి అలంకరణ సేవ అత్యంత వైభవంగా కొనసాగుతుంది. పశ్చిమ రాజగోపురం గుండా సేవను తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేంచేపు మండపం పై ఆస్థానం చేసి, వేదమంత్రాలు, దివ్యప్రబంధ పశురాలను పఠించారు. సాయంత్రం హంస వాహన అలంకరణ సేవ నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈనేపథ్యంలో.. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు గవర్నర్ తమిళసై చేరుకున్నారు. గవర్నర్ ను గార్డ్ ఆఫ్ హానర్ తో జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నాలుగో రోజు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం జరిగే హోమం, వటపత్ర శాయి అలంకార సేవలో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు.
Read also: Raja Singh: నన్ను చంపుతామని బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి..
Also Read
మాడవీధుల్లో ఊరేగిన శ్రీస్వామి వారి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఉదయం 9.05 గంటలకు యాదగిరి గుట్టకు చేరిన గవర్నర్ మొదటగా స్వయంభూ నరసింహుడి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ మాట్లాడుతూ.. కరోనా విలయం, ఆలయ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఇవి అని కొనియాడారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈసారి చాలా ప్రత్యేకమైనవని, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని గవర్నర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, సుఖవంతంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. ప్రజలందరూ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించాలని కోరారు. నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రజలు పాల్గొని, స్వామివారిని దర్శించుకోని, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Cyber Thieves: టెలిగ్రామ్ యాప్, డేటాఫ్ బర్త్ పేరిట మోసం.. కోట్లు కొట్టేస్తున్న సైబర్ కేటుగాళ్లు
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?