యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు నాలుగో రోజు ఉదయం వత్రశాయి అలంకరణ సేవ అత్యంత వైభవంగా కొనసాగుతుంది.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పున ప్రారంభం అవుతోంది. యాదాద్రికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మహాకుంభ సంప్రోక్షణ లో పాల్గొంటున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రి కి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళారు కేసీఆర్ దంపతులు. బాలాలయం నుంచి ప్రారంభమైంది శోభాయాత్ర. స్వామి, అమ్మవార్ల యంత్రాలు, సువర్ణ ప్రతిష్ఠాలంకర మూర్తుల విగ్రహాలను వేద పండితులు, రుత్వికుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలతో ప్రధానాలయం వరకు మొదలైంది శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్…