వైఎస్ షర్మిల దీక్ష.. డబ్బులివ్వలేదని అడ్డా కూలీల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నిరుద్యోగ సమస్యను ఆయుధంగా మలచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. దీనికోసం ప్రతీ మంగళవారం ఒక చోట నిరుద్యోగ దీక్ష చేస్తూ వస్తున్నారు.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ.. వారికి ఆర్థికసాయం చేయడం.. ఆ తర్వాత కొన్ని గంటల పాటు దీక్ష చేస్తూవస్తున్నారు. అయితే, దీక్ష కోసం తమను తీసుకొచ్చి డబ్బులివ్వడం లేదని ఆరోపిస్తూ అడ్డా కూలీలు ఆందోళనకు దిగడం చర్చగా మారింది.. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి.. 50 మందిని తీసుకొచ్చారని అంటున్నారు.. ఇప్పుడు డబ్బులు అడిగితే ఇవ్వడంలేదంటూ ఆందోళనకు దిగారు.. అయితే, మీడియాతో మాట్లాడుతున్న మహిళలకు నచ్చజెప్పిన నాయకులు దూరంగా తీసుకెళ్లారు. మరోవైపు.. వైఎస్ షర్మిల చేపట్టే దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. నాయకులు, కార్యకర్తలు.. దీక్షా స్థలి దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఇవాళ బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్షకు దిగాలని నిర్ణయించారు.. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. ఇది రద్దు చేయాల్సి వచ్చింది..
Also Read
తాజావార్తలు
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..