Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
- ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
- వరదలో కొట్టుకుపోయిన బైకిస్టులు
- సమయస్ఫూర్తితో కాపాడిన గ్రామస్థులు
- లో-లెవల్ వంతెనపై సాహసం వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపు నీటితో జిల్లాలోని చెరువులు, కాలువలు పూర్తిస్థాయిలో నిండడమే కాకుండా, వాగులు , వంకలు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో చింతల మానేపల్లి మండలంలోని దిందా, కేతుని గ్రామాల మధ్య ఉన్న లో-లెవల్ వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణాలకు తెగించి దాటవద్దని అధికారులు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ, పరిస్థితుల తీవ్రతను గమనించకుండా రోడ్లు దాటే ప్రయత్నాలు చేయడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
Also Read
ఇటీవల కేతుని గ్రామం వైపు నుండి దిందా వైపునకు బైక్‌పై బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు, మార్గమధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న లో-లెవల్ వంతెనను దాటేందుకు సాహసించారు. ప్రవాహ వేగం తీవ్రంగా ఉండటంతో అదుపుతప్పిన బైక్ తో పాటు ఆ ఇద్దరు వ్యక్తులు క్షణాల్లో వరద నీటిలో చిక్కుకుపోయి కొట్టుకుపోవడం ప్రారంభించారు. ఈ ఘోర ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధైర్యంగా స్పందించారు. వేగంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగి, సమయస్ఫూర్తితో ఆ ఇద్దరినీ సురక్షితంగా బయటకు లాగి ప్రాణాపాయం నుంచి కాపాడారు. సమయానికి స్థానికులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, వరదలు తగ్గే వరకు ఇటువంటి ప్రవాహాలు దాటేందుకు ఎవరూ సాహసించవద్దని స్థానికులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?