Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు
- ఏడుగురు మృతి.. పలువురి ఆచూకీ గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా తూర్పు ప్రాంతంలోని అమూర్లో భారీ అగ్ని ప్రమాదం, పేలుడు సంభవించింది. రష్యా-చైనా సంయుక్తంగా నిర్మిస్తున్న అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చైనా పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో తొమ్మిది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడిన 152 మందికి చికిత్స అందించగా.. వారిలో 36 మందిని ఆస్పత్రులకు తరలించినట్లు రాయిటర్స్ నివేదించింది.
ప్రమాద సమయంలో ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి పారిశ్రామిక సముదాయంలోని పలు ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్లాంట్‌లో ప్రీ-కమిషనింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
రష్యా-చైనా సంయుక్త ప్రాజెక్ట్
అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ రష్యాకు చెందిన పెట్రోకెమికల్ సంస్థ సిబుర్, చైనా ప్రభుత్వ ఆధీనంలోని చమురు, గ్యాస్ దిగ్గజం సినోపెక్ సంయుక్త ప్రాజెక్ట్. రష్యాలోని అమూర్ ప్రాంతంలో స్వోబోడ్నీ పట్టణానికి సమీపంలో ఈ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం గరిష్ఠ స్థాయిలో ఉన్న సమయంలో సుమారు 30 వేల మంది కార్మికులు ఇందులో పనిచేసినట్లు సంస్థ వెల్లడించింది. దాదాపు 10 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాలిథిలిన్, పాలీప్రొపైలిన్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఏడాదికి సుమారు 23 లక్షల టన్నుల పాలిథిలిన్, 4 లక్షల టన్నుల పాలీప్రొపైలిన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముడి పదార్థాలు ఎక్కడి నుంచి?
అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌కు అవసరమైన ముడి పదార్థాలు సమీపంలోని అమూర్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి సరఫరా కానున్నాయి. ప్రాజెక్టు వివరాల ప్రకారం.. ఏడాదికి సుమారు 20 లక్షల టన్నుల ఈథేన్, మరో 15 లక్షల టన్నుల ఎల్పీజీని అమూర్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి AGCCకి తరలించనున్నారు. ముడి పదార్థాలను ప్రాసెస్ చేసి పాలిథిలిన్, పాలీప్రొపైలిన్ వంటి ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే పదార్థాలను ఉత్పత్తి చేయనున్నారు.
అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ సుమారు 325 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ప్లాంట్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే దాదాపు 1,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ప్రాజెక్టు నిర్మాణం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ కోసం ఇంజినీర్లకు శిక్షణ 2016లోనే ప్రారంభమైంది. 2024లో ప్లాంట్ కమిషనింగ్ దశలోకి ప్రవేశించింది. త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంపై దర్యాప్తు
అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. పారిశ్రామిక భద్రతా నిబంధనలు ఉల్లంఘించారా? ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? అనే అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Russia’s Amur Gas Chemical Complex, slated to become one of the largest in the world, suffered a sudden explosion and fire this morning, severely damaging the facility.
The plant had been scheduled to open soon and was undergoing pre-commissioning work ups. pic.twitter.com/HqzINwQuS5
— OSINTtechnical (@Osinttechnical) August 25, 2026
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!