పరిచయం లేనివారితో స్నేహం చేయడం.. అన్నీ వారితో పంచుకోవడం ఎప్పటికైనా ముప్పే.. అలాంటి ఘటనే ఇది.. మీర్‌పేట్ ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉండే శ్వేతారెడ్డి అనే మహిళకు ఫేస్‌బుక్‌లో మల్కారం యాష్మ కుమార్ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే శ్వేతారెడ్డి, యాష్మకుమార్‌లు న్యూడ్ వీడియో కాల్స్ చేసుకునే వారు. అయితే ఆ సమయంతో న్యూడ్ కాల్స్‌ను యాష్మ కుమార్ రికార్డ్ చేశాడు. అయితే కొన్ని రోజులుగా యాష్మకుమార్ తనను పెళ్లి చేసుకోవాలని.. లేకుంటే నగ్న వీడియోలు మీ బంధువులకు పంపిస్తానంటూ శ్వేతారెడ్డిని వేధింపులకు గురి చేశాడు.
దీంతో.. ఎలాగైనా యాష్మకుమార్‌ను అంతమొందిచాలని నిర్ణయించుకుంది శ్వేతారెడ్డి.. ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో యాష్మ కుమార్‌ను శ్వేతారెడ్డి హతమార్చింది. అంతేకాకుండా.. హత్య చేసి రోడ్డు యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరి ప్లాన్‌ను భగ్నం చేసి.. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.