Hyderabad Crime: హైదరాబాద్‌లో విషాదం.. భర్త మరణాన్ని భరించలేక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Commits Suicide After Demise Of Her Husband In Hyderabad: హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. డీడీ కాలనీకి చెందిన సాహితికి (29) ఏడాదిన్నర క్రితం వనస్థలిపురంకు చెందిన మనోజ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగితో వివాహం జరిగింది. వీళ్లిద్దరు అమెరికాలోని డల్లాస్‌లో సెటిల్ అయ్యారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. పెళ్లయ్యాక ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరిగింది. ఒకరికి మరొకరు అంటే ఎంతో ఇష్టం.
VC Sajjanar: ప్రజల్ని మోసం చేసిన ఆ సంస్థని ప్రమోట్ చేయొద్దు.. ఐపీఎల్ యాజమాన్యంకు సజ్జనార్ రిక్వెస్ట్
Also Read
కట్ చేస్తే.. సాహిత ఈ నెల 2వ తేదీన తన తల్లిదండ్రుల్ని చూసేందుకు ఇండియాకి తిరిగొచ్చింది. డీడీ కాలనీలో ఉంటున్న తన పేరెంట్స్ ఇంటికి వెళ్లింది. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మనోజ్, సాహితి ఫోన్లో మాట్లాడునేవారు. అయితే.. 20వ తేదీన మనోజ్ గుండెపోటుతో మృతిచెందాడు. 23వ తేదీన అతని మృతదేహం ఇండియాకి వచ్చింది. అశ్రునయనాల మధ్య 24వ తేదీన మనోజ్ అంత్యక్రియల్ని జరిపారు. ఆ తర్వాత సాహితి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. తన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న బాధలోనే ఉండిపోయింది. అదే రోజు రాత్రి సాహితి తన చెల్లెలు సంజన రూమ్‌లో కలిసి పడుకుంది.
Raghunandan Rao: ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలి
గురువారం ఉదయం 09:20 గంటల సమయంలో సంజన వాష్‌రూమ్ కోసమని రూమ్ నుంచి బయటకు వెళ్లింది. 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చి చూస్తే.. లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా సాహితి నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో.. అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా, సాహితి చీరతో ఫ్యాన్‌కి ఉరి వేసుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సాహితి ఆత్మహత్యతో.. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంగఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!