Sara Arjun: సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్.. మ్యూజికల్ లవ్‌స్టోరీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sara Arjun New Movie: ‘ధురంధర్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న యువ నటి సారా అర్జున్.. ఇప్పుడు బాలీవుడ్లో వరుస అవకాశాలను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్గా తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తదుపరి ప్రాజెక్టుల ఎంపిక విషయంలో సారా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అందుకే ‘ధురంధర్ 2’ విడుదలై ఎనిమిది నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఈ యంగ్ బ్యూటీ కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.
గత కొంతకాలంగా ప్రముఖ నటి మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు టాలీవుడ్‌లోనూ సారా పేరు వినిపిస్తోంది. గతంలో ‘యుఫోరియా’ సినిమాలో మైనర్ బాలిక పాత్రలో కనిపించిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. రామ్ చరణ్ తదుపరి చిత్రం ఆర్సీ17 కోసం సారా ఆడిషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాత్రకు సారాను ఎంపిక చేయాలా? లేక సాత్విక వీరవల్లాను తీసుకోవాలా? అనే విషయంలో మేకర్స్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
Also Read
- OM Box Office Collections: కలెక్షన్స్ భారీగా డ్రాప్.. 'ఓం' బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రావాలంటే?
- Allu Arjun: అల్లు అర్జున్ ప్లాన్ అదిరింది.. మైల్ స్టోన్ మూవీకి ఎవరు?
- Amit Shah: రామాయణ టీమ్‌తో అమిత్ షా భేటీ.. రణ్‌బీర్, సాయిపల్లవికి అభినందనలు
- Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
ఈ ప్రాజెక్టులపై చర్చలు కొనసాగుతుండగానే.. సారా మరో బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఆమెను తమ తదుపరి చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ‘సైయారా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ సంస్థ.. మరో మ్యూజికల్ లవ్‌స్టోరీని రూపొందించేందుకు సిద్ధమవుతోందట. ఈ చిత్రంలో అంబరీష్ వర్మ హీరోగా నటించనున్నట్లు సమాచారం. దర్శకుడు మనీష్ శర్మ ఈ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సారా ఎంపికపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Sara Arjun: సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్.. మ్యూజికల్ లవ్‌స్టోరీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?
-
Road Accident : రెండు కార్లు ఢీ.. గాల్లోకి ఎగిరిన బైకర్.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్.!
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
OM Box Office Collections: కలెక్షన్స్ భారీగా డ్రాప్.. ‘ఓం’ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రావాలంటే?
-
CM Revanth Reddy: రాజ్యాంగంపై బీజేపీ కుట్ర చేస్తోంది.. తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ట్రెండింగ్
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!