Hyderabad: ముగ్గురూ.. స్నేహితులు ! పొట్టకూటి కోసం బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చారు !! ముగ్గురూ ఒకేచోట పనిలో చేరారు. కలిసి పనిచేసుకుంటూ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. అన్యోన్యంగా ఉన్న వారి మధ్య అనుమాన భూతం చిచ్చు పెట్టింది. తన భార్యపై కన్నేశాడని తెలుసుకుని స్నేహితుడిని మందలించాడు..!! పలుమార్లు హెచ్చరించాడు..!! ఐనా తీరు మార్చుకోకపోవడంతో కక్షగట్టి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని మూసీ కాలువలో పడేశాడు. అంబర్‌పేట్‌లో జరిగిన ఈ మర్డర్ మిస్టరీని తెలివిగా చేధించారు పోలీసులు.
అంబర్ పేట్‌లో మూసీ కాలువలో కొట్టుకొచ్చిన అనుమానస్పద మృతదేహంపై మిస్టరీ వీడింది. యువకుడిని (షోరబ్) హత్య చేసి మూసీ కాలువలో పడేశారని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు (మహమ్మద్ జావిద్, మహమ్మద్ అమీరుల్ హాక్) యువకుడి మెడకి వైర్లు చుట్టి హత్య చేసినట్లుగా గుర్తించారు. అంబర్ పేట పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డీసీపీ బాలస్వామి యువకుడి హత్య వివరాలను మీడియాకు వెల్లడించారు. మహమ్మద్ జావేద్ (27), మహమ్మద్ అమీరుల్ హాక్, షోరబ్ (30) ముగ్గురు…