BJP MLA Raghunandan Rao Demanding CBI Enquiry On ORR Tollgate: ఓఆర్ఆర్ టోల్‌గేట్ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము సీబీఐకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ అంశంపై బీజేపీ చాలారోజులుగా ప్రశ్నిస్తోందని, అయితే ఇటీవల బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదని కొందరు విమర్శిస్తున్నారని, తమకు ఎవరూ సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదని చురకలంటించారు. ఐఆర్‌బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారని, ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. అసలు టోల్‌గేట్ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందిచండం లేదని ఆయన ప్రశ్నించారు.
MLA Vivekananda: కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు
7200 కోట్ల నుంచి 7380 కోట్లకు ఓఅర్ఆర్ టెండర్ విలువ పెంచింది ఎవరో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని రఘునందన్ రావు నిలదీశారు. ఒక దర్యాప్తు సంస్థ దీనిపై విచారణ జరుపుతోందని వెల్లడించారు. ఐఆర్‌బీ సంస్థ నేర చరిత్ర కలిగిందని, అలాంటి సంస్థకు టెండర్‌ను రద్దు చేయాలని కోరారు. వేసవి సెలవుల తరువాత దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అంతర్జాతీయ టెండర్ అని చెప్పినప్పుడు.. నిబంధనలు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో హెచ్‌ఎండీఏ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐఆర్‌బీ సంస్థకు ఎందుకు వెసులుబాటు ఇస్తున్నారని అడిగిన ఆయన.. టెండర్ల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సీబీఐ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఐఆర్‌బీ ఎక్కడిది? ఆ సంస్థ ఎవరిది? ఇంత మోసం జరుగుతుంటే ఎందుకు సీఎం స్పందించడం లేదు? ఓఆర్ఆర్ టోల్ గేట్‌పై సమీక్ష చేయడానికి సీఎం కేసీఆర్‌కు టైం లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Naveen Ul Haq: కోహ్లీకి నవీన్ ‘సారీ’ చెప్పాడా.. ఇదిగోండి ప్రూఫ్
అంతకుముందు కూడా.. కవిత, కేటీఆర్ తమ స్నేహితుల కంపెనీకి ఓఆర్ఆర్‌ను లీజుకు ఇచ్చారని రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్‌ను ఏప్రిల్ 11న తెరిచారని, కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని అన్నారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. కంపెనీ దాఖలు చేసిన బిడ్ కంటే.. ఈ 16 రోజుల్లో బిడ్ అమౌంట్ ఎలా పెరిగిందని అడిగారు. దీని వెనుక ఏదో మతలబు జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.