తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది.. ఎక్కడ చూసిన అతడి న్యూసే.. రాజకీయ నేతలు కూడా ఆ పేరు ప్రస్తావిస్తూ.. విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సోదాలు నిర్వహించడంతో చికోటి.. చికటి సామ్రాజ్యం లింక్‌లు కదులుతున్నాయి.. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా.. హీరోయిన్లు, సినీ ప్రముఖులతో సంబంధాలు కలిగిఉన్న ఆయన.. వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చారనే విషయం వెలుగు చూసింది.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు.. ఇలా.. చాలా మంది చికోటితో చీకటి బాగోతం నడిపారనేఏ ఆరోపణలు వస్తున్నాయి.. చికోటీ ప్రవీణ్…అలియాస్ క్యాసినో ప్రవీణ్.. ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని టాక్ నడుస్తోంది. దీంతో, అసలు ఎవరు ఈ చికోటి ప్రవీణ్..? అనే విషయం ఆసక్తికరంగా మారింది..
Read Also: Vijay Devarakonda: రష్మిక నా డార్లింగ్.. ఎట్టకేలకు బంధాన్ని బయటపెట్టిన రౌడీ హీరో
ఇప్పుడు చికోటి ప్రవీణ్ గురించి గూగుల్‌లో కూడా సెర్చ్ చేస్తున్నారట.. ! ఈడీ సోదాలతో అంతలా ఫేమస్ అయిపోయిన చికోటి.. అసలు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.. అతడి లైఫ్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసొచ్చిన వ్యక్తే.. ఇప్పుడు మంత్రులు, మాజీ మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులతో సెల్ఫీ దిగేవరకు వెళ్లినా.. ఈవెంట్లకు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లను పిలిచి రెమ్యునరేషన్ ఇచ్చినా.. తన చుట్టూ.. హంగు ఆర్భాటం ఉన్నా.. క్యాసినోతో పాటు.. చీకటి వ్యాపారాన్ని నడుపుతూ.. ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నా.. గతంలో వ్యాపారాలు చేసిన దివాలా తీసిన వ్యక్తే.. హైదరాబాద్, సైదాబాద్‌లోని వినయ్ నగర్ కాలనీ లో 20 ఏళ్ల క్రితం చీకోటి ప్రవీణ్ చిన్న సిరామిక్ టైల్స్ వ్యాపారి.. సినిమాలంటే ఆసక్తి ఉండడంతో.. నిర్మాతగా మారి సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు.. విలన్‌గా నటించినా సంపాదించింది లేదు కానీ.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.. అయితే, అప్పుల నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్ చేయడం.. ఆ కేసులో జైలుకు సైతం వెళ్లాడు.. ఇక, ఆ తర్వాత గోవాలో ఓ పేకాట క్లబ్‌లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తూ వచ్చిన చికోటి.. అంచెలంచెలుగా ఎదుగుతూ క్యాసినో సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలా ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు.. అన్ని డిపార్ట్‌మెంట్లతో టచ్‌లోకి వెళ్లాడు.. రాజకీయ నేతలను సైతం బుట్టలో వేసుకున్నాడు.
జంట నగరాల్లో తొలినాళ్లలో బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినో నిర్వహించాడట.. చిన్న చిన్న పార్టీలతో అందరినీ ఆకర్షిస్తూ.. పరిచయాలు పెంచుకుంటూ.. తన బిజినెస్ ను విస్తరించాడు.. ఇక, రాజకీయ నేతలతో ఉన్న పరిచయాలతో 2014 తర్వాత చికోటి ప్రవీణ్ బిజినెస్ టర్న్ అయింది. సిటీకే పరిమితమైన తన చీకటి వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకు.. దేశాలకు విస్తరించేశాడు.. ఈ చీకటి బాగోతంలో పలువురు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు సైతం చికోటి కస్టమర్ల లిస్ట్‌లో ఉన్నారట. వాళ్ల సాన్నిహిత్యం, సహకారంతోనే చికోటి వ్యవహారం విదేశాలకు విస్తరించాడు.. అంతెందుకు.. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు కస్టమర్లను తీసుకెళ్లి కోట్ల రూపాయలతో పేకాట ఆడించాడంటే అర్థం చేసుకోవచ్చు..
చికోటి లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేశాడు.. హైక్లాస్‌గా గడుపుతాడు.. ఎక్కడికి వెళ్లినా హంగు ఆర్భాటాలు.. అనునిత్యం ఓ ప్రైవేట్ సైన్యం అతడి వెంటే ఉంటుందట.. తాజాగా జరిగిన లష్కర్ బోనాలకు వెళ్లిన చికోటి ప్రవీణ్ వెంట బాడీ గార్డ్స్ వచ్చి హంగామా చేశారు.. ఇక, ఇటీవల కర్మాన్ ఘాట్‌లో చికోటి ప్రవీణ్ బర్త్ డే వేడుకలో ఓ రేంజ్‌లో నిర్వహించారు.. బర్త్‌డే పార్టీకి ప్రత్యేకంగా పాఠల సీడీనే విడుదల చేశారు.. మొత్తంగా నభూతో నభవిష్యతి అనే తరహాలో చికోటీ బర్త్‌డే జరిగింది.. క్యాసినో కింగ్ మేకర్‌గా ఉన్న చికోటి గతంలో అనేకసార్లు పోలీసులకు పట్టుబడిన సందర్భాలు ఉన్నా.. మళ్లీ బయటకు రావడం.. యథావిథిగా తన పని చేసుకోవడం జరుగుతూ వచ్చాయి.. ఇప్పటికే సోదాలు నిర్వహించిన ఈడీ.. ఇప్పుడు చికోటి ప్రవీణ్ బర్త్‌డే పార్టీపై ఆరా తీస్తోంది.. బర్త్‌డే కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఈడీకి సమాచారం అందింది.. ఆ మొత్తం హవాలా రూపంలో చెల్లించినట్లు గుర్తించారు.. ప్రవీణ్ బర్త్‌డేకి రాజకీయ నాయకులు, ప్రముఖుల క్యూ కడితే.. అధికార, ప్రతిపక్షాల నేతలు కూడా వాలిపోయారు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లు కూడా హాజరయ్యారు.. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
చికోటి ప్రవీణ్‌తో పాటు ఈ చీకటి వ్యాపారంలో మాధవరెడ్డి పాత్ర చాలా కీలకమైనది అధికారులు గుర్తించారు.. పాలు, పెరుగు అమ్ముకునే స్థాయి నుంచి క్రమంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడి లక్షల రూపాయలు అప్పుల్లో కూరికుపోయి.. చికోటి ప్రవీణ్‌తో పరిచయంతో క్యాసినో సామ్రాజ్య విస్తరణకు దారితీసిందట.. ఇక, హైదరాబాద్ శివారులోని కడ్తాల్ సమీపంలో సాయిరెడ్డిగూడెం దగ్గర చికోటికి ఫామ్‌హౌస్ ఉంది.. జూలో ఉండాల్సిన పాములు, ఇతర కొన్ని జంతువులను నిబంధనలకు విరుద్ధంగా ఫామ్‌హౌస్‌లో ఉంచాడు.. ఇవాళ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించారు.. నిబంధనలకు విరుద్ధంగా పాములు, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇగుణలు ఉన్నాయని.. ఫామ్‌హౌస్‌లో పైథాన్ వుందని సమాచారం వచ్చింది… కానీ, అది కనిపించట్లేదని తెలిపారు. ఫామ్‌హౌస్ మొత్తం తనిఖీ చేశాం.. జూలో స్వేచ్చగా తిరగాల్సిన వాటిని ఇక్కడ బంధించారని తెలిపారు.. అయితే, చికోటి ప్రవీణ్ తనకు ఇష్టమైన పక్షులను మాత్రమే ఇక్కడ పెంచుకుంటున్నారు… ఇక్కడ ఎలాంటి పార్టీలు జరగవు అని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ వున్న జంతువులు, పక్షులకు అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా చికోటి ప్రవీణ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.