1. ఐపీఎల్ సీజన్ 2022లో నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగునుంది. అయితే.. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరుగనుంది.
2. నేడు రెండో రోజు జపాన్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాధినేతలతో భేటీ కానున్నారు.
3. నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు నెల కోటా టికెట్లను ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
4. తెలంగాణలో నేటితో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. జూన్ 20లోగా పరీక్షా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
5. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,430లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,500లుగా ఉంది.