* నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన..
* నేడు పార్టీ నేతలతో కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు.. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ..
* నేడు సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సన్నాహక సభ.. పాల్గొననున్న సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా, పువ్వాడ నాగేశ్వర్ రావులు..
* నేడు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలపై చర్చ.. ఇప్పటికే జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం కమిటీ వేసిన బీజేపీ..
* నేడు తూర్పుగోదావరి జిల్లా దసరా ఉత్సవాలు ముగింపు సందర్భంగా గోకవరం దేవిచౌక్ లోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన రథం భారీ ఊరేగింపు..
* నేడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసులో పీహెచ్సీ వైద్యులతో మరోమారు చర్చలు.. చర్చలకు పిలిచిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ.. విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్ లో ఉదయం 11 గంటలకు చర్చలు.. ఓవైపు చర్చలు జరుపుతున్నా కొనసాగుతున్న పీహెచ్సీ వైద్యుల నిరాహారదీక్ష..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయాయి.. అక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం..
* నేడు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్..